న్యూఢిల్లీ: గత నాలుగైదు నెలల్లోనే బంగారం ధరలు 20 శాతానికి పైగా పెరిగి రూ.40,000కు సమీపంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీపావళి, ధన్‌తెరాస్ వంటి పండుగల సమయంలో గత ఏడాది కంటే సేల్స్ తగ్గిపోయాయి. అంతర్జాతీయ వాణిజ్య పరిస్థితులు కూడా బంగారం ధరలు పెరగడానికి కారణం. మన దేశంలో రూపాయి బలహీనపడటం కూడా ఓ కారణం. దీంతో ఈసారి సేల్స్ తగ్గాయి. ఐతే పసిడి, ఆభరణాల సేల్స్ భారత్‌లోనే కాదు ఆసియాలోనే తగ్గుముఖం పట్టాయి.

2010 జూన్ తర్వాత కనిష్టానికి జ్యువెల్లరీ డిమాండ్
ప్రపంచవ్యాప్తంగా జ్యువెల్లరీ డిమాండ్ సెప్టెంబర్ క్వార్టర్‌లో16 శాతం (ఇయర్ టు ఇయర్) తగ్గి 460.9 టన్నులకు పడిపోయినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సెల్ (WGC) రిపోర్ట్ తెలిపింది. 2010 జూన్ క్వార్టర్ నుంచి జ్యువెల్లరీ డిమాండ్ అత్యంత కనిష్టానికి పడిపోవడం ఇదే మొదటిసారి. ఔన్స్ బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లో 1500 డాలర్లకు అటూ ఇటూ తచ్చాడుతోంది.

భారత్‍లోను అదే పరిస్థితి...
ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ వాణిజ్య పరిస్థితుల ఒత్తిళ్ళు... కస్టమర్లు వారి కొనుగోలు ప్రణాళికలను మోడరేట్ చేయడానికి ప్రోత్సహించింది. చాలా మార్కెట్లు ఇయర్ టు ఇయర్ ప్రకారం క్షీణతను నమోదు చేశాయి. భారత్‌లోను అదే పరిస్థితి నెలకొని ఉంది. బంగారంపై కస్టమ్ డ్యూటీని 12.5 శాతం తగ్గించడం కూడా జ్యువెల్లరీ సేల్స్ తగ్గడానికి కారణమయ్యాయని WGC రిపోర్ట్ పేర్కొంది.

పండుగపై ఆశలు పెట్టుకున్నప్పటికీ..
భారత్‌లో అటో సేల్స్, ఎఫ్ఎంసీజీ బలహీనంగా ఉన్న సమయంలో బంగారానికి డిమాండ్ పెరుగుతుందని ఆశించే పరిస్థితి లేదని పేర్కొంది. ఐతే జ్యువెల్లరీ వ్యాపారులు అక్టోబర్ నెలలో దీపావళి, ధన్‌తెరాస్ వంటి పండుగలు ఉండటంతో ఆశలు పెట్టుకున్నారని, భారీ ఆఫర్లు కూడా ప్రకటించారని కానీ అది ఆశించిన మేర ఫలితం చూపలేదని అంటున్నారు. గత ఏడాది కంటే సేల్స్ తగ్గినప్పటికీ చాలామంది అంచనాల కంటే మాత్రం పసిడి విక్రయాలు పెరిగాయి.

60 శాతం తగ్గుదల
మరో నివేదిక ప్రకారం సెప్టెంబర్ క్వార్టర్లో బంగారం సేల్స్‌పై భారీగా ప్రభావం పడింది. ఇయర్ టు ఇయర్ లెక్కన 26 శాతం పడిపోయింది. ఈ కాలంలో భారత్‌లో అసాధారణంగా 60 శాతం మేర డిమాండ్ పడిపోవడం గమనార్హం. చైనాలో 13 శాతం, యూరోపియన్‌లో 12 శాతం తగ్గింది. ఆసియా దేశాలలో స్థానిక కరెన్సీ ప్రకారం బంగారం ధరలు అధికంగా ఉన్నాయి. దీంతో డిమాండు పెరగలేదని నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం చాలామంది అమెరికా - చైనా వాణిజ్య చర్చల వైపు చూస్తున్నారు.

చైనాలో తగ్గుదల
ప్రపంచంలో అత్యధిక గోల్డ్ కన్స్యూమర్ చైనా. ఇండియాతో పాటు చైనా కూడా తక్కువ బంగారం దిగుమతులను తగ్గించుకుంది. ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ కాలంలో దిగుమతులు 9 శాతం తగ్గించింది. చైనా గోల్డ్ అసోసియేషన్ ప్రకారం గత త్రైమాసికంతో పోలిస్తే ఈ త్రైమాసికంలో బంగారం వినియోగం 20.7 శాతం తగ్గి 244.8 టన్నులుగా ఉంది. ముఖ్యంగా బంగారానికి, ఆభరణాలకు అధిక డిమాండ్ కలిగిన చైనా, భారత్‌లలో కొనుగోళ్లు తగ్గిన ప్రభావం కనిపిస్తోంది.
More From GoodReturns

బంగారం ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన బ్యాంకింగ్ నిపుణులు.. పసిడి ర్యాలీ ఎంతవరకు అంటే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Gold price: బంగారం, వెండి ధరల్లో మార్పు.. కారణాలివే..

యుద్ధాన్ని వదిలి బంగారంపై కన్నేసిన చైనా.. టన్నుల కొద్ది పసిడి రహస్యంగా కొనుగోలు.. ధరల పెరుగదలపై ఆందోళన..

Gold: దుబాయ్‌లో డిస్కౌంట్‌కు లభిస్తున్న బంగారం.. అసలు కారణం ఇదే!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..



Click it and Unblock the Notifications