బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. సామాన్యుడి కొనలేనంతగా పుత్తడి ధర పెరిగింది. ఏప్రిల్ 12న దేశంలో బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం ధరపై ఏకంగా రూ.1,090 పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,230 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.66,210గా ఉంది. అదే సమయంలోకిలో వెండిపై రూ. 1500 పెరిగి రూ. 84,900కి చేరుకుంది.
హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,230కి పైగానే ఉంది. ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,360 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,380 వద్ద కొనసాగుతోంది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,210గాగా ఉంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,230గా ఉంది.

చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,260, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,370గా ఉంది. బెంగళూరులో ఈరోజు బంగారం ధర 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 66,210 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,230గా ఉంది. అంతర్జాతీయ పరిణామాలు, స్థానికంగా బంగారానికి డిమాండ్ పెరగడం, బంగారంపై పెట్టుబడులు పెరగడంతో పుత్తడి ధరలు పెరుగుతోన్నట్లు చెబుతున్నారు.
బంగారం ధర పెరగడంతో గోల్డ్ ఇటిఎఫ్‌లు, బంగారు బాండ్‌లకు కూడా డిమాండ్ పెరిగింది. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ 0.6 శాతం పెరిగి ఔన్సుకు $2,386.38 వద్ద ట్రేడవుతోంది. అంతకుముందు సెషన్‌లో బులియన్ 2,389.29 వద్ద రికార్డు స్థాయిని తాకింది. స్పాట్ సిల్వర్ ఔన్స్‌కు 0.7 శాతం పెరిగి 28.66 డాలర్లకు పెరిగింది.


Click it and Unblock the Notifications