ఆకాశమే హద్దుగా బంగారం ధరలు పెరిగిపోతున్నాయి. గత 40 రోజులుగా పుత్తడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా బంగారం జీవితకాల గరిష్ఠానికి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,000 లకు పైగా పలుకుతోంది. అటు వెండీ ధరలు కూడా భారీగానే పెరుగుతోన్నాయి. కిలో వెండి దాదాపు రూ.86,000 లుగా ఉంది. హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,910 లకు చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 68,600 లకు పెరిగింది.
40 రోజుల్లో పుత్తడి ధర ఏకంగా రూ.12 వేలు పెరిగింది. మార్చి 1న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,735 ఉండేది. ఇక వెండి ధర కిలో రూ. 74,300గా ఉంది. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పుత్తడి ధర రూ. 73,320 ఉండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,210 ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 74,250 ఉండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల పుత్తడి ధర రూ. 68,060గా ఉంది.

బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వర్ణం ధర రూ. 73,320 గా ఉంది. కాగా 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ. 67,210 గా ఉంది. అంతర్జాయంగా నెలకొన్ని ఉద్రిక్తత పరిస్థితులు, కొనసాగుతోన్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, హమాస్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రక్తత, తాజాగా ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య ఉద్రక్తతో పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. బంగారంపై పెట్టుబడి సురక్షితమైనదిగా భావిచండంతో ధరలు పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
బంగారం ధరలు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా భారీగానే పెరుగుతోన్నాయి. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 16 శాతం పెరిగింది.2023లో చైనా కేంద్ర బ్యాంక్ ఒక్కటే 225 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. భారత రిజర్వ్ బ్యాంక్ కూడా ఇటీవలి నెలల్లో 13 టన్నుల మేర బంగారం కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఈ సంవత్సంర జనవరికే మొత్తం నిల్వలు 800 టన్నులకు పెరిగాయి.


Click it and Unblock the Notifications