బంగారం ధరలో హెచ్చుతగ్గులు కనిపిస్తోన్నాయి. ఓ రోజు తగ్గితే మరో రోజు పెరుగుతోంది. తాజాగా పుత్తడి ధర మళ్లీ పెరిగింది. ఒక్క రోజే రూ.400 పైగా పెరిగింది. మార్చి 1 నుంచి బంగారం ధర పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల పుత్తడి ధర రూ. 72,650 గా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. రూ.66,700 గా ఉంది. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72, 790 గా ఉంది.
ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66, 590 గా ఉంది. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,660 గా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 66,610 గా ఉంది. కోల్ కత్తాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,660గా ఉండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల పుత్తడి ధర రూ. 66,610 గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,430 గా ఉంది. ఇక 22 క్యారెట్ల తులం స్వర్ణం ధర రూ.67,310 గా ఉంది.

హైదరాబాద్ లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 72,660 గా ఉంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,610 గా ఉంది. విజయవాడలో తులం 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,660 గా ఉంది. అంతర్జాతీయంగా కూడా బంగారం ధర పెరుగుతోంది. అంతర్జాతీయ విపణిలో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2320 డాలర్లుగా ఉంది. ఇక వెండి ధర రూ.27 డాలర్లుగా ఉంది. దేశంలో కిలో వెండి ధర రూ.80 వేలకు పైగా ఉంది.
బంగారం నాణ్యతను బట్టి ధర ఉంటుంది. 24 క్యారెట్ల బంగారం అంటే స్వచ్ఛతగా పుత్తడి అని అర్థం. ఇక 22 క్యారెట్ల బంగారం అంటే అందులో మరో లోహం కలిసి ఉంటుంది. ఆభరణాలు అన్ని 22 క్యారెట్లలోనే ఉంటాయి. రా బంగారం మాత్రమే 24 క్యారెట్ల నాణ్యతో ఉంటుంది. రా బంగారాన్ని ఆభరణం చేయాలంటే దానిలో రాగి కలపాలి. అప్పుడు అది 22 క్యారెట్ల పుత్తడిగా మారుతుంది.
More From GoodReturns

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Today Gold Silver Rate Live: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై లేటెస్ట్ రిపోర్ట్.. సరికొత్త నివేదికను విడుదల చేసిన ప్రముఖ బ్యాంకులు

నిజాం నవాబుల బంగారం.. హైదరాబాద్ వ్యాపారికి రూ. 50 కోట్లు టోపీ పెట్టిన కేటుగాళ్లు.. అసలు కథ ఏంటంటే..

Gold reserves: ఈ చిన్న దేశం కొంటున్న బంగారం చూస్తే కళ్లు చెదరాల్సిందే!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు ర్యాలీ చేసిందంటే.. ఏప్రిల్ 11, శనివారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

భారతీయుల ఇళ్లలో ఉన్న బంగారంపై షాకింగ్ న్యూస్.. 10 దేశాల కేంద్ర బ్యాంకుల నిల్వ కంటే ఎక్కువే..

ఈ ఏడాది బంగారం, వెండి పెరుగుదలపై సంచలన నివేదిక.. ఏకంగా ఆ స్థాయి వరకు వెళుతుందంటున్న నిపుణులు..

Today Gold Silver Rate Live: బంగారం, వెండి ధరలు పతనం.. ఈ రోజు రేట్లు ఎలా ఉన్నాయంటే..

Akshaya Tritiya: అక్షయ తృతీయ ఆఫర్లు.. బంగారం, డైమండ్లపై భారీ డిస్కౌంట్లు!



Click it and Unblock the Notifications