హోం  »  మ్యూచువల్ ఫండ్స్
మ్యూచువల్ ఫండ్ పథకాన్ని నమోదు చేసి క్లిక్ చేయండి 'వెళ్లు'

మ్యూచువల్ ఫండ్స్

మ్యూచువల్ ఫండ్ అంటే ఏమిటి?

మ్యూచువల్ ఫండ్, పెట్టుబడిదారుల నుంచి సేకరించిన మరియు ప్రకటించిన పెట్టుబడి లక్ష్యాలతో పెట్టుబడి పెట్టిన ధన నిధి. ఒక రకంగా చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇన్వెస్టర్ల దగ్గర నుండి రకరకాల స్కీముల ద్వారా డబ్బు సేకరించి, వాటిని వారి తరఫున రకరకాల పెట్టుబడి సాధనాలలో పెట్టుబడి పెట్టడం. ఏ స్కీము ల్లో పెట్టుబడి పెట్టాలనేది ఆ ఇన్వెస్టర్ల అభీష్టం మీద ఆధారపడి వుంటుంది.


ఇండియాలో మ్యూచువల్ ఫండ్స్

మ్యూచువల్ ఫండ్ డైలీ గెలిచినవారు అప్‌డేట్ చేయబడింది Mar 18th 2024, రోజు ముగిసింది

స్కీం పేరు కొత్త (%) డైలీ రాబడి
Nippon JapanEqu DP (G) 20.09 1.73
Nippon JapanEquity (G) 18.29 1.72
Quant Mid Cap DP (G) 227.50 1.59
Quant Mid Cap (G) 205.88 1.58
Quant Larg&MidCap DP (G) 116.55 1.52
Quant Larg&MidCap (G) 108.29 1.51
Quant Active DP (G) 648.84 0.97
Quant Active (G) 604.33 0.96
SBI MagComma DP (G) 94.63 0.94
SBI MagComma (G) 88.23 0.93

మ్యూచువల్ ఫండ్స్ డైలీ ఓడినవారు అప్‌డేట్ చేయబడింది Mar 18th 2024, రోజు ముగింపు

స్కీం పేరు కొత్త (%) డైలీ రాబడి
Motilal Os Midcap (G) 75.15 -0.91
Motilal Os Midcap DP (G) 84.92 -0.9
MotilalOs FlexiCap (G) 46.25 -0.72
MotilalOs FlexiCapD (G) 50.66 -0.72
DSP Focus (G) 42.88 -0.72
DSP Focus - DP (G) 47.21 -0.71
InvescoInd MidCap (G) 121.95 -0.57
InvescoInd MidCap DP (G) 144.20 -0.56
Kotak Quant (G) 13.12 -0.54
Kotak Quant DP (G) 13.13 -0.54

మ్యూచువల్ ఫండ్స్‌కి ఉదాహారణ:

మ్యూచువల్ ఫండ్స్‌ గురించి అర్ధం అయ్యేందుకు మీకు ఒక ఉదాహరణ వివరిస్తాను. సూపర్ రిటర్న్స్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ సూపర్ రిటర్న్స్ మ్యూచువల్ ఫండ్ అనే పధకాన్ని ప్రవేశపెట్టింది అనుకుందాం. ఈ పధకం క్రింద సూపర్ రిటర్న్ మిడ్ క్యాప్ స్కీమ్ ఉంది. స్టాక్ మార్కెట్ల నుంచి ఈ స్కీమ్ క్రింద వివిధ పెట్టుబడిదారుల నుంచి సుమారు రూ. 100కోట్లు సేకరించింది.

ఈ స్కీమ్ గనుక ఈక్విటీ స్కీమ్ ఐతే షేర్లలో ఎక్కువ మొత్తం వెచ్చించాల్సి ఉంటుంది. అదే రుణ స్కీమ్ ఐతే ఈ డబ్బుని గవర్నమెంట్ సెక్యూరిటీస్, బాండ్లలలో మదుపు చేస్తారు. ఈ ఫండ్ మొదట్లో ఒక యూనిట్‌ను రూ. 10కి ఇచ్చిందని అనుకుందాం. ఒక్కో యూనిట్‌కు గాను రూ. 10 కాబట్టి మొత్తంగా రూ. 10,000 చెల్లించి 1000 యూనిట్లను కొనుగోలు చేశారు.

ఒక్క సంవత్సరం తర్వాత సూపర్ రిటర్న్ మిడ్ క్యాప్ ఫండ్ విలువ రూ. 12కు చేరింది. ఈ సమయంలో మీరు మీ యూనిట్స్‌ను తిరిగి మ్యూచవల్ ఫండ్స్‌కు అమ్మినట్లైతే, మీరు కొనుగోలు చేసిన 1000 యూనిట్లకు గాను మీరు రూ. 12,000 పొందుతారు.

కొత్త యూనిట్లను కొనుగోలు చేయాలనుకునే కొనుగోలుదారుకి దీని వల్ల ఉపయోగం ఏంటీ?

కొత్తగా యూనిట్లను కొనుగోలు చేయాలనుకునే కొనుగోలుదారుడు రూ. 12 చెల్లించి యూనిట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తర్వాతి కాలంలో సూపర్ రిటర్న్ మిడ్ క్యాప్ ఫండ్ విలువ రూ. 12కు మించి పెరిగితే ఆ సమయంలో మీరు మీ యూనిట్లను అమ్ముకోవచ్చు. దీంతో మీరు ఎక్కువ డబ్బును పొందగలుగుతారు.

మ్యూచువల్ పంఢ్స్ వల్ల లాభాలు:

మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఎవరికి కావాల్సిన విధంగా వారు స్కీములను ఎన్నుకోవచ్చు. కొంతమంది నెలా నెలా స్థిర ఆదాయం ఇచ్చే ఇన్‌కమ్‌ ఫండ్స్‌ని ఎన్నుకుంటే, మరి కొందరు మొత్తం షేర్లలోనే పెట్టే ఎంక్వైరీ ఫండ్స్‌ని ఎన్నుకొంటారు. ఇలా ఎన్నో అవకాశాలు మ్యూచువల్‌ ఫండ్స్‌లో వుంటాయి.

1. ఈక్విటీ ఫండ్స్

ఈక్వీటీ షేర్లలో పెట్టుబడులు పెట్టేందుకు గాను పెట్టుబడిదారుల నుంచి డబ్బుని సేకరించే ఫండ్స్‌ను ఈక్విటీ ఫండ్స్ అంటారు. ఇవి చాలా ఎక్కువ రిస్క్‌తో కూడుకున్నవి. ఈ ఫండ్స్ వల్ల పెట్టుబడిదారులు కూడా ఎక్కువ నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ఎవరైతే పెట్టుబడిదారులు రిస్క్ తీసుకుంటారో వారికి మాత్రం ఖచ్చితంగా సరిపోయే ఫండ్స్ ఈక్విటీ ఫండ్స్.

2. డెట్ ఫండ్స్

డెట్ ఫండ్స్ ఓపెన్ ఎండెడ్ కేటగిరీ ఫండ్స్. అంటే మీరు ఈ ఫండ్స్‌ల్లో ఎప్పుడైనా, ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. అలాగే ఎప్పుడైనా, ఈ ఫండ్స్‌నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకోవచ్చు. కొన్ని డెట్ ఫండ్స్‌ల్లో మీకు అసలు నష్టాలే రావు. ప్రభుత్వ సెక్యూరిటీస్, కార్పోరేట్ డెట్, బ్యాంకులు విడుదల చేసిన డెట్ స్కీమ్‌లలో డబ్బుని పెట్టుబడి పెట్టడాన్ని డెట్ ఫండ్స్ అంటారు. ఎవరైతే పెట్టుబడిదారులు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరో అలాంటి వారికి డెట్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి.

3. బ్యాలె‌న్స్‌డ్ ఫండ్స్

మీ రిస్క్ సామర్థ్యం ఆధారంగా ఈక్విటీల్లో పెట్టుబడులు చేయడానికి విభిన్నమైన పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఆరునెలలు లేదా సంవత్సరం పాటు చిన్న మొత్తంతో బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం మంచిది. ఐదేళ్ళ కాలానికైతే బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ కంటే లార్జ్‌క్యాప్ ఫండ్స్ అనువైనవి. దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని అధికమించి రాబడులను అందించేది ఈక్విటీలు మాత్రమే.

4. మనీ మార్కెట్ మ్యూచవల్ ఫండ్స్

మనీ మార్కెట్ మ్యూచవల్ ఫండ్స్‌కు మరో పేరు లిక్విడ్ ఫండ్స్. డిపాజిట్లు, ట్రెజరీ, పేపర్ల ద్వారా తక్కువ కాలంలో ఎక్కువ మొత్తంలో డబ్బుని పెట్టుబడి పెట్టే ఫండ్స్‌ను మనీ మార్కెట్ మ్యూచవల్ ఫండ్స్‌ అంటారు. ఈ మనీ మార్కెట్ మ్యూచవల్ ఫండ్స్‌ తక్కువ కాలం వ్యవధికి పెట్టుబుడులు పెడతారు.

5 గిల్ట్ ఫండ్స్

గిల్ట్ ఫండ్స్ అంటే సెక్యూరిటీ ఎక్కువగా ఉంటే ఫండ్స్. గవర్నమెంట్ సెక్యూరిటీస్‌లో పెద్ద మొత్తంలో డబ్బుని మదుపు చేస్తారు. ఈ డబ్బుని బ్యాంకింగ్ రంగంలో మదుపు చేయడం వల్ల మీ డబ్బుకి ఎలాంటి ఇబ్బంది ఉండదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X