బంగారం ధర అకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. సామాన్యులు కొనలేని పరిస్థితిలోకి వెళ్తోంది. దేశీయంగా, అంతర్జాతీయంగా పుత్తడి ధరలు పరుగులు పెడుతున్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఇప్పటికే 70,000 దాటింది. ప్రస్తుతం హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల పుత్తడి ధర రూ. 70,490 గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.64,620 గా ఉంది. ఈ లెక్కన 24 క్యారెట్ల గ్రాము గోల్డ్ ధర రూ.7,049 గా ఉంది.
ముంబైలో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ, 64,610 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల బంగారం ధర రూ.70,480 గా ఉంది. కోల్‌కతాలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.64,610 ఉండగా.. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 70,480. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.70,630గా ఉంది.
చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,410గా ఉంది.

బంగారం గత 35 రోజుల్లో భారీగా పెరిగింది. గత నెల మార్చి 1న 10 గ్రాముల 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.63,160 గా ఉండేది. అటే అప్పటి నుంచి ఇప్పటి వరకు రూ. 7,330 పెరిగింది. ఇక మార్చి 1న 22 క్యారెట్ల 10 గ్రాముల స్వర్ణం ధర రూ.57,900 ఉంది. ఇప్పుడు రూ.64,620గా ఉంది. అంటే 35 రోజుల్లో రూ.7,330 పెరిగింది. అయితే బంగారం ధర ఇంకా పెరుగుతుందా.. అంటే చెప్పలేని పరిస్థితి నెలకొంది.
అంతర్జాతీయంగా గోల్డ్ రేట్లు పెరగడంతో పాటు దేశీయంగా కూడా బంగారానికి డిమాండ్ ఉండడంతో ధరలు పెరుగుతున్నట్లు చెబుతున్నారు. ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధాన వ్యవసాయేతర పేరోల్స్ డేటాపై మార్కెట్ దృష్టి మళ్లించడంతో గోల్డ్ ఐదు సెషన్లగా పెరుగుతోంది. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2284 డాలర్ల వద్ద కొనసాగుతోంది. బంగారంతోపాటు వెండి ధరలు కూడా పెరుగుతోన్నాయి.


Click it and Unblock the Notifications