For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇన్ఫోసిస్ భారీ షాక్: 12,000 ఉద్యోగుల తొలగింపు, ఏ స్థాయిలో ఎంతమంది అంటే?

|

బెంగళూరు: భారత రెండో అతిపెద్ద సాఫ్టువేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ వేలాది మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోందని వార్తలు వస్తున్నాయి. దాదాపు 10,000 నుంచి 12,000 మంది విడతలవారీగా తొలగించే అవకాశముందని సమాచారం. ఇప్పటికే కాగ్నిజెంట్ ప్రపంచవ్యాప్తంగా 7 వేల నుంచి 13వేల మంది ఉద్యోగులను తొలగించనుంది. ఇప్పుడు ఇన్ఫోసిస్ కూడా అదే బాటలో పయనిస్తోంది. ఇప్పటికే మిడిల్, సీనియర్ స్థాయిలోని ఉద్యోగులను ఇళ్లకు పంపుతోంది. ఉద్యోగుల వ్యయాలు తగ్గించుకోవడంతో పాటు కంపెనీ నిర్మాణాన్ని సరళతరం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో జాబ్ కట్ నిర్ణయం తీసుకుంది.

వీరి జాబ్ కట్

వీరి జాబ్ కట్

ఇన్ఫోసిస్ జేఎల్ 6 (సీనియర్ మేనేజర్లు)లో 10 శాతం మందిని లేదా 2,200 మందిని తొలగిస్తోంది. జేఎల్ 6, జేఎల్ 7, జేఎల్ 8 స్థాయిల్లో కంపెనీకి 30,000 పైగా ఉద్యోగులు ఉన్నారు. జేఎల్ 3 కంటే దిగువన, మధ్యస్థాయి అయిన జేఎల్ 4, జేఎల్ 5ల్లోని ఉద్యోగులను 2 శాతం నుంచి 5 శాతం మేర ఉద్యోగులను తొలగించనుంది. ఈ మేరకు ఆంగ్ల మీడియాలో వార్తలు వచ్చాయి. జేఎల్ 3, జేఎల్ 5లలో కంపెనీకి వరుసగా 86,558 మంది, లక్షా పదివేల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. అంటే దాదాపు 4 వేల నుంచి 10వేల మందిని తగ్గించుకోనుంది.

వారిలో 50 మందిపై వేటు

వారిలో 50 మందిపై వేటు

పైవారితో పాటు 971 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు (అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్స్, వైస్ ప్రెసిడెంట్స్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్స్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్స్)లలో రెండు శాతం నుంచి ఐదు శాతం మందిపై కత్తి వేలాడుతోందని తెలుస్తోంది. అంటే ఇందులో యాభై మందికి పైగా ఉగ్యోగులకు ముప్పు ఉంది.

ఖర్చులు తగ్గించుకునేందుకేనా?

ఖర్చులు తగ్గించుకునేందుకేనా?

ఇన్ఫోసిస్ సంస్థాగత ఖర్చులను తగ్గించుకునేందుకే ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు భావిస్తున్నారు. అందుకే మధ్య, సీనియర్ స్థాయి ఉద్యోగుల్ని ఎంచుకున్నారని అంటున్నారు. ఆర్థిక మందగమనంతో నేపథ్యంలో వ్యాపారం తగ్గింది. ఇటీవల సంస్థాగతంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టి ఉండవచ్చునని భావిస్తున్నారు.

ఇన్ఫోసిస్ ఏమని చెప్పింది?

ఇన్ఫోసిస్ ఏమని చెప్పింది?

అత్యున్నత పని తీరుకు ప్రాధాన్యమిచ్చే కంపెనీల్లో అంచనాల మేరకు పని చేయలేకపోతున్న ఉద్యోగుల తొలగింపు సాధారణంగా జరిగేదేనని, దీనిని భారీగా ఉద్యోగాల కోతగా భావించవద్దని ఇన్ఫోసిస్ విజ్ఞప్తి చేసింది. అత్యుత్తమ పనితీరు ఉన్న తమ సంస్థలోను కోతలు ఉంటాయని, వాటిని కాస్ట్ కట్టింగ్ వంటి వాటి కింద చూడవద్దని తెలిపింది.

పింక్ స్లిప్స్ ఇవ్వలేదు..

పింక్ స్లిప్స్ ఇవ్వలేదు..

ఇది ఉద్యోగాల తొలగింపు కాదని, రెండేళ్లుగా లేదా రెండు క్వార్టర్లుగా మీ పని తీరు బాగా లేకుంటే వెళ్లిపోమని చెబుతుంటారని అంటున్నారు. మేం ఉద్యోగులకు పింక్ స్లిప్స్ ఇవ్వలేదని, కంపెనీ అంతర్గత విషయాలకు సంబంధించిన డేటాను ఇవ్వలేమని కంపెనీ చెప్పినట్లుగా తెలుస్తోంది. మీరు కంపెనీకి అవసరం లేదు.. రేపటి నుంచి రావొద్దు అని ఉద్యోగులకు చెప్పలేదని అంటున్నారు.

వారికి సమయం ఇస్తుందా?

వారికి సమయం ఇస్తుందా?

ప్రపంచంలోని ఇతర టెక్ కంపెనీల్లా కాకుండా మీరు ఇప్పుడే వెళ్లాలని ఇన్ఫోసిస్ చెప్పదని, వారికి సమయం ఇస్తుందని అంటున్నారు. జూలై - సెప్టెంబర్ రెండో క్వార్టర్లో కన్సాలిడేటెడ్ ఆట్రిషన్ రేటు 21.7 శాతం తగ్గింది. ఈ క్వార్టర్లో 7457 మంది టెక్కీలను ఉద్యోగంలోకి తీసుకుంది. ఇన్ఫోసిస్‌లో క్వార్టర్లో 236,486 ఉద్యోగులు ఉన్నారు. అంతకుముందు క్వార్టర్‌లో 229,029 ఉండగా, అంతకుముందు ఏడాది ఇదే క్వార్టర్లో 217,739 ఉద్యోగులు ఉన్నారు.

English summary

ఇన్ఫోసిస్ భారీ షాక్: 12,000 ఉద్యోగుల తొలగింపు, ఏ స్థాయిలో ఎంతమంది అంటే? | Infosys may fire thousands of mid level and senior employees

The country's second largest software services company Infosys has terminated the services of non performing employees at multiple levels.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X