Gold News: దేశంలోని ఫైనాన్స్, బ్యాంకింగ్, ఫిన్ టెక్ సేవలు అందించే కంపెనీలపై ఇటీవలి కాలంలో ఆర్బీఐ నజర్ భారీగా పెరిగింది. చిన్న తప్పులకు సైతం కంపెనీలపై రిజర్వు బ్యాంక్ కఠినమైన వైఖరిని ప్రదర్శిస్తోంది.
ఇటీవలి కాలంలో పెద్ద బ్యాంకులు, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తర్వాత తాజాగా ఐఐఎఫ్ఎల్ వ్యాపారాలపై ప్రకటించిన ఆంక్షలు ఆందోళలు రేకెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ బ్యాంకుల బంగారు రుణాల ఖాతాలపై కేంద్ర ప్రభుత్వం కన్ను వేసింది. వాస్తవానికి గోల్డ్ లోన్ పుస్తకాలను సమీక్షించాలని ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఆర్థిక మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. ఈ లేఖ కూడా ముఖ్యమైనది ఎందుకంటే గత వారం సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్, IIFL ఫైనాన్స్‌పై చర్య తీసుకుంటూ కొత్త బంగారు రుణాల వితరణను నిషేధించిన సంగతి తెలిసిందే.

అంతర్జాతీయ ఆర్థిక పరిణామాల కారణంగా బంగారం ధరల పెరుగుదలతో బ్యాంకులు ఇప్పటికే ఉన్న రుణాలపై టాప్-అప్ రుణాలు ఇవ్వాలని యోచిస్తున్నాయని ప్రభుత్వం, నియంత్రణాధికారులు ఆందోళన చెందుతున్నారని వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో జనవరి 1 తర్వాత మంజూరు చేసిన గోల్డ్ లోన్ల ఖాతాలను సమీక్షించాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. తనఖాలో ఉంచిన బంగారం కొలేటరల్ విలువలను అంచనా వేయాలని లేఖలో పేర్కొంది. నిబంధనల ప్రకారం అవసరమైన గోల్డ్ గ్యారెంటీ లేకుండా బంగారు రుణాలను పంపిణీ చేస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేసింది. అలాగే వడ్డీ రేటు, ఛార్జీలతో పాటు ఇతర అంశాల్లో వ్యత్యాసాలను గమనించినట్లు పేర్కొంది.
ఏడాది ప్రాతిపదికన బంగారం రుణాలు పెరుగుతున్న దృష్ట్యా ఈ సర్క్యులర్ జారీ చేయబడింది. బంగారం ధరలలో 16.6% పెరగగా.. బంగారు రుణాలు 17% పెరిగాయి. జనవరి 26న బంగారు ఆభరణాలపై రుణం రూ.1.01 లక్షల కోట్లుగా ఉన్నాయి. గతవారం గోల్డ్ లోన్స్ వ్యాపారంలో ఉన్న ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ కంపెనీని రుణాల పంపిణీ తక్షణం నిలిపివేయాలని రిజర్వు బ్యాంక్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. కంపెనీ గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియోలో పర్యవేక్షణ స్థాయిలో కొన్ని ఆందోళనలు కనిపించాయని, రుణం మంజూరు సమయంలో, డిఫాల్ట్ వేలం సమయంలో బంగారం స్వచ్ఛత, నికర బరువు, పరీక్ష, ధృవీకరణలో లోపాలు ఉన్నాయని పేర్కొంది.
More From GoodReturns

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 2, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications