నెస్లే ఇండియా ఏప్రిల్ 25న మార్చి త్రైమాసికం ఫలితాలను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ.934 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాదితో పోలిస్తే ఇది 27 శాతం ఎక్కువ.గతం సంవత్సరం నికర లాభం రూ.737 కోట్లుగా ఉంది. ఈ ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఫుడ్ తయారు చేస్తుంటుంది. ఈ బేబీ ఫుడ్‌లో చక్కెర శాతం ఎక్కువగా ఉన్నాయి ఆరోపణలు వచ్చాయి. దీంతో కంపెనీ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) విచారణను ఎదుర్కొంటోంది.
కంపెనీ రెవెన్యూ 9% పెరిగి రూ.5,268 కోట్లకు చేరింది. నెస్లే 2024 చివరి నాటికి భారతదేశంలో నెస్‌ప్రెస్సోను లాంచ్ చేస్తుందని, తన నెట్‌వర్క్, ఆన్‌లైన్ ఛానెల్‌లు, బోటిక్‌ల ద్వారా నెస్‌ప్రెస్సో ఉత్పత్తులను (మెషీన్‌లు, క్యాప్సూల్స్) విక్రయించడం చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.
నెస్లే హెల్త్ సైన్స్ ప్రపంచ శ్రేణి పోషకాహార ఆరోగ్య పరిష్కారాలు, విటమిన్లు, మినరల్స్ మరియు ఆరోగ్య సప్లిమెంట్లను ఒకచోట చేర్చేందుకు నెస్లే ఇండియా డాక్టర్ రెడ్డీస్‌తో జాయింట్ వెంచర్‌పై సంతకం చేసింది.

జాయింట్ వెంచర్ 2024-25 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో కార్యాచరణలోకి వస్తుందని భావిస్తున్నారు. "పెరుగుతున్న ఆహార ద్రవ్యోల్బణం, అస్థిర వస్తువుల ధరల వల్ల సవాళ్లు ఎదురైనప్పటికీ, తాము రెండంకెల వృద్ధిని సాధించాం. తమ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియో అంతటా ప్రైసింగ్, మిక్స్‌ల కలయికతో బలమైన వృద్ధిని సాధించాము" అని నెస్లే ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సురేష్ నారాయణన్ అన్నారు.
నెస్లే ఇండియా వివిధ విభాగాలలో చెప్పుకోదగ్గ విజయాలను సాధించింది. వీరి ప్రొడక్ట్ NESCAFÉ గత ఏడు సంవత్సరాల్లో భారతదేశంలో 30 మిలియన్ల కుటుంబాలకు చేరుకోవడంతో, బెవరేజెస్ వ్యాపారం కూడా బలమైన పనితీరును ప్రదర్శించింది. ద్రవ్యోల్బణ ఒత్తిడి ఉన్నప్పటికీ, పాల ఉత్పత్తులు, పోషకాహారం బలమైన వృద్ధిని సాధించింది. ముఖ్యంగా MAGGI నూడుల్స్, MAGGI మసాలా-ఏ-మ్యాజిక్ గణనీయమైన వృద్ధిని సాధించాయి. భారత్ MAGGIకి ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద మార్కెట్‌గా అవతరించింది.
More From GoodReturns

HDFC Bank ఫలితాలు: సోమవారం మార్కెట్ భారీగా పడిపోతుందా?

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. ట్రంప్ ప్రకటనతో షేర్ మార్కెట్లో పుల్ జోష్..

భారత స్టాక్ మార్కెట్: ద్రవ్యోల్బణం డేటాతో భారీ కుదుపులు తప్పవా?

Stock market: ఐటీ స్టాక్స్ క్రాష్! నిఫ్టీ ఐటీ ఇండెక్స్ డౌన్.. భారీ నష్టాల్లో టాప్ కంపెనీలు!

బంగారం, భూమి, స్టాక్ మార్కెట్.. ఈ ఏడాది తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు అందించే బెస్ట్ ఆప్షన్ ఏదంటే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

విప్రో ఫలితాల వేళ ఇన్వెస్టర్లకు భారీ షాక్ తప్పదా?

ద్రవ్యోల్బణం గణాంకాలతో నేడు స్టాక్ మార్కెట్ భారీ మలుపు?

స్టాక్ మార్కెట్ సెలవు: బుధవారం భారీ యాక్షన్ గ్యారెంటీనా?

స్టాక్ మార్కెట్లలో ఈ వారం భారీ యాక్షన్, ఇన్వెస్టర్లు సిద్ధమా?

Paskistan: పాకిస్థాన్‌కు కోలుకోలేని దెబ్బ! చర్చలు విఫలం కావడంతో రూ. 78,000 కోట్లు గల్లంతు! ఎలాగంటే..



Click it and Unblock the Notifications