Bombay High Court: దేశంలోని బ్యాంకింగ్ సంస్థలు చేస్తున్న పనులకు ఇటీవలి కాలంలో కోర్టుల నుంచి మెుట్టికాయలు పడుతూనే ఉన్నాయి. తాజాగా ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులకు మరో ఎదురుదెబ్బ తగిలింది.
కేంద్ర ప్రభుత్వ కార్యాలయ మెమోరాండం ప్రకారం భారతీయులు, విదేశీయులపై లుక్ అవుట్ సర్క్యులర్(LOC) జారీ చేసే అధికారం ప్రభుత్వ రంగ బ్యాంకులకు లేదని బాంబే హైకోర్టు నేడు సంచలన తీర్పులో పేర్కొంది. ఎల్‌ఓసీ చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా జస్టిస్ జీఎస్ పటేల్, జస్టిస్ మాధవ్ జామ్‌దార్ తమ తీర్పును వెలువరించారు. కేంద్ర ప్రభుత్వ ఆఫీస్ మెమోరాండం రాజ్యాంగ విరుద్ధం కానప్పటికీ.. బ్యాంకు మేనేజర్‌లకు ఎల్‌ఓసీ జారీ చేసే అధికారాన్ని ఏకపక్షంగా పరిగణిస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది.

ముఖ్యంగా ఈ నిర్ణయం ట్రిబ్యునల్స్ లేదా క్రిమినల్ కోర్టులు జారీ చేసిన ప్రస్తుత ఆదేశాలను ప్రభావితం చేయదు. ఇది వ్యక్తులను కేవలం విదేశాలకు వెళ్లకుండా పరిమితం చేస్తుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇమ్మిగ్రేషన్ బ్యూరోచే నిర్వహించబడే LOC.. వ్యక్తులు భారతదేశాన్ని విడిచి వెళ్ళకుండా ఆపడానికి అధికారులను అనుమతిస్తుంది. ఈ సర్క్యులర్లను మెుదట 2010లో జారీ చేయటం ప్రారంభించారు.
ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అని పిటిషనర్లు కోర్టు ముందు దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇటువంటి సర్క్యులర్‌లు ప్రాథమిక హక్కులను, ముఖ్యంగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ను ఉల్లంఘిస్తున్నాయని పిటిషనర్లు వాదించారు. బ్యాంకుల ఆర్థిక ప్రయోజనాలు దేశ ఆర్థిక ప్రయోజనాలతో సమానంగా ఉండకూడదని కోర్టులో వాదనల సమయంలో పేర్కొన్నారు. ఇదే క్రమంలో ప్రతిస్పందనగా ఎల్ఓసీల జారీలో ఎటువంటి ప్రాథమిక హక్కుల ఉల్లంఘన లేదని హోం మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కాదని కోర్టుకు తెలిపింది. రెండు పక్షాల వాదనలు విన్న తర్వాత బాంబే హైకోర్టు తన తీర్పును వెలువరిస్తూ.. ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఎల్ఓసీల జారీ హక్కు లేదని తేల్చి చెప్పింది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications