Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
ఫుడ్ టెక్ దిగ్గజం స్విగ్గీ (Swiggy) ఐపీఓగా రానుంది. కంపెనీల రిజిస్ట్రార్ (RoC)తో రెగ్యులేటరీ ఫైలింగ్‌ల ప్రకారం $1.2-బిలియన్ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO) తీసుకురావడానికి వాటాదారుల నుంచి ఆమోదం పొందింది. బెంగుళూరుకు చెందిన కంపెనీ తాజా ఇష్యూ ద్వారా రూ. 3,750 కోట్లు (దాదాపు $450 మిలియన్లు), ఆఫర్-ఫర్-సేల్ (OFS) కాంపోనెంట్‌గా రూ. 6,664 కోట్ల (సుమారు $800 మిలియన్లు) వరకు సమీకరించాలని యోచిస్తోంది.
మార్చి 2022లో తన మెగా $1 బిలియన్ ఐపీఓ కోసం స్విగ్గీ సిద్ధమవుతోందని మనీకంట్రోల్ మొదటిసారిగా నివేదించింది. ఆ తర్వాత ఐపీఓ వాయిదా పడుతూ వస్తుంది. ఐపీఓ కంటే ముందుగా యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి సుమారు 750 కోట్ల రూపాయలను సమీకరించాలని కంపెనీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. "తాజా ఇష్యూ ద్వారా మొత్తం రూ. 37,501 మిలియన్ల వరకు ఈక్విటీ షేర్లను జారీ చేయడానికి ఆమోదం లభించింది" అని కంపెనీ ఏప్రిల్ 23న జరిగిన అసాధారణ సాధారణ సమావేశం (EGM) తర్వాత చేసిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.

స్విగ్గిలో దాదాపు 32 శాతం వాటాను కలిగి ఉన్న ప్రోసస్ వంటి పెట్టుబడిదారులు ఐపీఓలో తమ వాటాను విక్రయించవచ్చు. స్టాక్ మార్కెట్ లో కంపెనీ లిస్ట్ అయిన తర్వాత ప్రమోటర్లు తమ వాటాను 25 శాతానికి తగ్గించుకోవాలి. ట్రాక్‌ఎక్స్‌ఎన్ ప్రకారం స్విగ్గీలో సాఫ్ట్‌బ్యాంక్ కు 8 శాతం, యాక్సెల్ కూ 6.2 శాతం, ఫౌండర్ గ్రూప్ కు 6.7 శాతం, ఎలివేషన్ క్యాపిటల్ కు 4.4 శాతంతో పాటు నార్వెస్ట్, టెన్సెంట్, డిఎస్‌టి గ్లోబల్, ఆల్ఫా వేవ్ వాటాలు ఉన్నాయి.
ఇదే మీటింగ్ లో శ్రీహర్ష మెజెటీ, నందన్ రెడ్డిలను కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమించారు. స్విగ్గీ డిసెంబర్ 2023 వరకు తొమ్మిది నెలల కాలానికి $207 మిలియన్ల నష్టాన్ని నమోదు చేసింది.


Click it and Unblock the Notifications