బంగారం ధరలు అస్థిరంగా ఉంటున్నాయి. రెండు రోజులు పెరిగితే మరో రోజు తగ్గుతోంది. తాజాగా బంగారం ధర పెరిగింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల సగటు ధర సుమారు రూ. 62,730 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,500గా ఉంది. వెండి కిలోకు రూ.74,500కి చేరుకుంది.ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పుత్తడి ధర రూ. 57,650 గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,880 గా ఉంది.
ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,500 ఉండగాతత 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,730గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,950 ఉండగా.. క్యారెట్ల బంగారం ధర రూ. 63,220గా ఉంది. డిసెంబరు 28న బంగారం ధర రూ.64,250 గా ఉంది. ఆ తర్వాత తగ్గుతూ పెరుగుతూ వస్తోంది. ఢిల్లీ, ముంబైలలో కిలో వెండి ధర పెరిగింది. కిలో వెండి రూ. 76,000 గా ఉంది.

తెలుగురాష్ట్రాల్లో కూడా బంగారం ధరల పెరిగాయి. హైదరాబాద్ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,730 గా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,650 గా ఉంది. విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,730 గా ఉంది. కరీంనగర్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,730 గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో పెద్దగా తేడా లేదు.
శుక్రవారం, COMEXలో బంగారం ఔన్స్‌కి $ 1.05 పెరిగి $ 2031.50 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. ఒక్కో ఔన్స్‌కు 22.75 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది. బంగారం ధరను తెలుసుకునే ముందు, 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవడం ముఖ్యం. 24 క్యారెట్లు ఎలాంటి కల్తీ లేకుండా 100% స్వచ్ఛమైన బంగారం. అయితే 22 క్యారెట్లలో వెండి లేదా రాగి వంటి అల్లాయ్ లోహాలు కలుపుతారు. ఇందులో 91.67 శాతం స్వచ్ఛమైన బంగారం ఉంది.


Click it and Unblock the Notifications