Adani News: అదానీలో పెట్టుబడుల గుట్టు రట్టు చేసిన రెగ్యులేటర్ SEBI..!!
Gautam Adani: చాలా కాలం తర్వాత మరోసారి అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారం తెరమీదకు వచ్చింది. అదానీ కంపెనీల్లో జరిగిన పెట్టుబడుల్లో నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ గుర్తించింది.
అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన 12 ఆఫ్‌షోర్ ఫండ్స్ డిస్ల్కోజర్ నిబంధనలను పాటించలేదని సెబీ గుర్తించింది. ఈ వ్యవహారం గురించి తెలిసిన ఇద్దరు వ్యక్తులు ఈ వివరాలను బయటపెట్టినప్పటికీ ఇప్పటి వరకు అదానీ గ్రూప్, సెబీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవటం గమనార్హం. రెగ్యులేటర్ ఈ ఏడాది ప్రారంభంలో 12 అదానీ గ్రూప్ ఆఫ్‌షోర్ ఇన్వెస్టర్లకు ఛార్జీలను వివరిస్తూ నోటీసులు పంపింది. బహిర్గతం ఉల్లంఘనలు, పెట్టుబడి పరిమితుల ఉల్లంఘనపై వివరణ ఇవ్వాలని కోరినట్లు వెల్లడైంది.

ఆఫ్‌షోర్ ఫండ్ కంపెనీలు ఫండ్ల వారీగా అదానీ గ్రూప్ కంపెనీల్లో తమ పెట్టుబడుల వివరాలను ప్రకటిస్తుండగా.. సెబీ మాత్రం మెుత్తం గ్రూప్ కంపెనీల్లో కలిగిఉన్న పెట్టుబడుల గురించి వివరాలు వెల్లడించాలని కోరుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే మెుత్తం 12 ఫండ్ సంస్థల్లో 8 ఆఫ్‌షోర్ ఫండ్స్ ఇప్పటికే సెబీని సంప్రదించాయి. రూల్స్ పాటించటంలో జరిగిన తప్పిదాలను సెటిల్ చేసుకునేందుకు అవసరమైన పెనాల్టీలు చెల్లించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నాయి. పెనాల్టీ చెల్లించడం ద్వారా ఛార్జీలను పరిష్కరించాలని వ్రాతపూర్వక అభ్యర్థనలతో SEBIకి చేరుకున్నాయి.
అదానీ గ్రూప్ పై ప్రస్తుత వార్త ప్రతికూల ప్రభావాన్ని చూపించేదిలా ఉన్నప్పటికీ నేడు ఇంట్రాడేలో అదానీ లిస్టెడ్ స్టాక్స్ లాభాల్లోనే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, అదానీ పవర్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ విల్మార్, ఏసీసీ సిమెంట్స్, ఎన్డీటీవీ, అంబూజా సిమెంట్స్ కంపెనీల షేర్లు లాభాల ప్రయాణాన్ని నేడు కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications