బంగారం ధర పెరిగింది. 2024 మార్చి 1న పుత్తడి ధరలు పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర దాదాపు రూ.63,150కి పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల స్వర్ణం ధర రూ. 57,900గా ఉంది. వెండి కిలో రూ.74,500కి చేరుకుంది. హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,170 గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,910 గా ఉంది. 24 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర రూ.6,317 గా ఉంది.
ఢిల్లీలో, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58,050గా ఉంది అదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 63,310 గా ఉంది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,160గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు స్వల్పంగావృద్ధి చెందాయి. శుక్రవారం, బంగారం $ 0.30 చేరింది.

COMEXలో ఔన్స్ $ 2054.65 వద్ద కొనసాగుతోంది. మరోవైపు వెండి ధరలు కూడా పెరిగాయి. ఒక్కో ఔన్స్‌కి 22.96 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది. బంగారం ధర డిసెంబరు 28న బంగారం ధరలు రూ.64,250గా ఉండేది. ఆ తర్వాత తగ్గుతూ పెరుగుతూ వస్తోంది.
బంగారం ధరను తెలుసుకునే ముందు దాని స్వచ్ఛత గురించి తెలుసుకోవాలి. పుత్తడిలో నాణ్యతలో చాలా రకాలు ఉంటాయి.
అందులో 24 క్యారెట్లు, 22 క్యారెట్ల నాణ్యత ఉంటుంది. 24 క్యారెట్ల బంగారం అంటే 100 శాతం స్వచ్చమైనది. ఇందులో ఎలాంటి లోహం ఉండదు. ఇక 22 క్యారెట్ల బంగారం అంటే ఇందులో లోహం ఉంటుంది. ఇది 91 శాతం స్వచ్ఛతగా ఉంటుంది. నగల షాపులో కొనగోలు చేసే ఆభరణాలు అన్ని 22 క్యారెట్ల నాణ్యతతో ఉంటాయి.


Click it and Unblock the Notifications