Closing Bell: ఉదయం ఉల్లాసంగా మెుదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి స్వల్ప లాభాలతో నేడు తమ ప్రయాణాన్ని ముగించాయి. ఈ క్రమంలో రియల్టీ రేట్లు లాభాల్లో కొనసాగగా.. మెటల్ స్టాక్స్ మార్కెట్లను కిందకు లాగాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 90 పాయింట్లు లాభపడగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 32 పాయింట్లు గెయిన్ అయ్యింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 46 పాయింట్లు పెరగగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ భారీ ర్యాలీతో 518 పాయింట్ల మేర లాభపడింది. నేడు మార్కెట్ల క్లోజింగ్ నాటికి బీఎస్ఈ మిడ్ క్యాప్ సూచీ 0.5 శాతం లాభపడగా.. స్మాల్ క్యాప్ సూచీ 1 శాతం మేర లాభపడ్డాయి. నేడు నిఫ్టీ సైడ్‌వేస్ తన ట్రేడింగ్ కొనసాగించింది. అయితే మెుత్తానికి మార్కెట్ల ట్రెండ్ పాజిటివ్‌గా కొనసాగింది.

NSEలో గ్రాసిమ్, ఎయిర్ టెల్, నెస్లే, మారుతీ, టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, టైటాన్, హిందుస్థాన్ యూనీలివర్, ఎల్ టిఐఎమ్, ఎస్బీఐ, దివీస్ ల్యాబ్, హీరో మోటార్స్, ఐటీసీ, బ్రిటానియా, పవర్ గ్రిడ్, ఇన్ఫోసిస్, టీసీఎస్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి.
ఇదే క్రమంలో సన్ ఫార్మా, బీపీసీఎల్, రిలయన్స్, డాక్టర్ రెడ్డీస్, హిందాల్కొ, మహీంద్రా అండ్ మహీంద్రా, అపోలో హాస్పిటల్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, ఎస్బీఐ లైఫ్, బజాజ్ ఫిన్ సర్వ్, సిప్లా, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్స్, కోల్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎల్‌టి కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications