గత ఐదు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,550 ఉండగా.. 22 క్యారెట్ల పుత్తడి ధర రూ. 57,340గా ఉంది. వెండి ధర కూడా తగ్గింది. వెండి కిలో రూ.75,400కి చేరుకుంది. హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,700 గా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,340గా ఉంది. విశాఖపట్నం, కరీంనగర్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,700 గా ఉంది.
వెండి కిలో రూ.75,400గా ఉంది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,340గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,550గా ఉంది.ఢిల్లీలో, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం కోసం రూ. 57,490 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పుత్తడి ధర రూ. 62,700 గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,840, 24 క్యారెట్ల పుత్తడి ధర రూ. 63,100గా ఉంది.

24 క్యారెట్ల బంగారం అనగా.. ఫ్యూర్ గోల్డ్. 22 క్యారెట్ల బంగారం అంటే ఆభరణాలు. గోల్డ్ షాపుల్లో ఆభరణాలు కొనుగోలు చేస్తే వాటి నాణ్యత 22 క్యారెట్లగానే ఉంటుంది. మీరు 24 క్యారెట్ల నాణ్యత గల బంగారం కొని నగలు చేస్తే అది 22 క్యారెట్ల బంగారంగా మారుతుంది. అంతర్జాతీయంగా
స్పాట్ బంగారం ఔన్సుకు $2,024.00 వద్ద ఫ్లాట్‌గా ఉంది, అయితే US గోల్డ్ ఫ్యూచర్స్ 0.2% తగ్గి ఔన్సుకు $2,035.00కి చేరుకుంది. అదే సమయంలో, US డాలర్ ఇండెక్స్ 0.1% క్షీణించింది.
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతున్నప్పటికీ.. అంతర్జాతీయ ప్రభావంత బంగారం ధర తగ్గినట్లు తెలుస్తోంది. బంగారం ధరలు రోజు రోజుకు మారుతుంటాయి.


Click it and Unblock the Notifications