For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కెన‌డా వ‌ర్క్ వీసాల్లో చైనీయుల‌ను దాటేసిన భార‌తీయులు

వైట్ కాల‌ర్ ఉద్యోగాల‌కు మాత్రం అమెరికా, ఆస్ట్రేలియా, కెన‌డా లాంటి దేశాలే ప్ర‌ధాన కేంద్రాలుగా ఉంటున్నాయి. ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం ఏమిటంటే కెన‌డా వ‌ర్క్ వీసాలు పొందడంలో మ‌న దేశ పౌరులు చైనీయుల‌ను దాటేశారు

|

భార‌తీయులు స్వ‌తాహాగా విదేశాల్లో ప‌నిచేసేందుకు ఉవ్విళ్లూరుతుంటారు. అలాంటి దేశాల్లో అమెరికా ఎప్పుడు ముందుంటుంది. అయితే బ్లూ కాల‌ర్‌ ఉద్యోగాల‌కు అర‌బ్ దేశాలు కేరాఫ్ అడ్ర‌స్ అవ్వ‌గా వైట్ కాల‌ర్ ఉద్యోగాల‌కు మాత్రం అమెరికా, ఆస్ట్రేలియా, కెన‌డా లాంటి దేశాలే ప్ర‌ధాన కేంద్రాలుగా ఉంటున్నాయి. ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం ఏమిటంటే కెన‌డా వ‌ర్క్ వీసాలు పొందడంలో మ‌న దేశ పౌరులు చైనీయుల‌ను దాటేశారు.

కెన‌డా వ‌ర్క్ వీసాల్లో చైనీయుల‌ను దాటేసిన భార‌తీయులు

కెన‌డా ఇంట‌ర్రేష‌నల్ మొబిలిటీ కార్య‌క్ర‌మానికి సంబంధించిన ఇప్పుడున్న గ‌ణాంకాలు తెలియజేస్తున్న‌ది ఏమిటంటే కెన‌డా వ‌ర్క్ వీసాలు పొంద‌డంలో చైనా దేశాన్ని మంచి భారత్ ముందుంటోంది. ఈ ఏడాది జ‌న‌వ‌రి-జూన్ మ‌ధ్య భార‌తీయులు 13,670 వీసాలు పొంద‌గా, చైనా విష‌యంలో ఈ సంఖ్య 8680గా ఉంది. అంతే కాకుండా తాత్కాలిక ప‌నిమీద వెళ్లే విష‌యంలో సైతం చైనా దేశ‌స్థుల సంఖ్య 635గా ఉండ‌గా మ‌న దేశం నుంచి వెళ్లేవారి సంఖ్య 2190గా ఉంది. ఈ గ‌ణాంకాల‌న్నీ ఇమ్మిగ్రేష‌న్‌, రెఫ్యూజిస్‌, సిటిజ‌న్‌షిప్‌(ఐఆర్‌సీసీ) నుంచి వెల్ల‌డైన‌వి.
కెన‌డా దేశం ప్ర‌పంచం న‌లుమూల‌ల నుంచి ప్ర‌తిభావంతుల‌ను ఆక‌ర్షిస్తుంది. జూన్ నెలలో గ్లోబ‌ల్ టాలెంట్ స్ట్రీమ్ ప్రోగ్రామ్‌(జీటీఎస్‌పీ)లో భాగంగా ద‌ర‌ఖాస్తుల‌ను రెండు వారాల్లో వేగంగా ప్రాసెస్ చేసింది. అంతే కాకుండా లేబ‌ర్ మార్కెట్ ప్రాభావిత అంచ‌నాల నుంచి స్వ‌ల్ప మిన‌హాయింపులు ఇచ్చింది. ఎక్కువ నైపుణ్యం క‌లిగిన విదేశీ పౌరుల‌ను పంపే కంపెనీలు జీటీఎస్‌పీలో భాగంగా ద‌ర‌ఖాస్తులు పంప‌వ‌చ్చు. ఇందులో కంప్యూట‌ర్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, ఐటీ లాంటి 10 ప్ర‌ధాన వృత్తులు ఉంటాయి.

Read more about: canada visa jobs
English summary

కెన‌డా వ‌ర్క్ వీసాల్లో చైనీయుల‌ను దాటేసిన భార‌తీయులు | Indians are ahead in getting work visas from Canada beating china

Indians are obtaining Canadian work visas like never before and are beating Chinese nationals in the race. As per the latest statistics, Indians are ahead of China in getting Canadian work visas under Canada's international mobility programme
Story first published: Saturday, August 26, 2017, 15:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X