హెల్త్ కేర్ దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ అమ్మకాలను సంస్థ నిలిపివేసింది. అమెరికా, కెనడా దేశాలలో తమ బేబీ పౌడర్ అమ్మకాలు నిలిపి వేయనున్నామని అమెరికా ఫార్మా దిగ్గజ సంస్థ ఎట్టకేలకు అధికారికంగా ప్రకటించింది. ఇక యుకె లో టాల్క్ ఆధారిత జాన్సన్ బేబీ పౌడర్‌ను అమ్మడం కొనసాగిస్తామని చెప్పారు. జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ టాల్క్ క్యాన్సర్ కు కారణమవుతుందని సంవత్సరాలుగా వాదన వినిపిస్తుంది .వేలాది కేసులు, కోట్ల డాలర్ల పరిహారం లాంటి అంశాల నేపథ్యంలో సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

అమెరికా , కెనడాలలో జాన్సన్ పౌడర్ విక్రయాల నిలిపివేత నిర్ణయం
జాన్సన్ బేబీ టాల్క్ ఉత్పత్తుల ద్వారా తమకు అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ఆరోపించిన 22 మంది మహిళలకు నష్టపరిహారంగా 7 4.7 బిలియన్ చెల్లించాలన్న 2018 ఉత్తర్వులకు వ్యతిరేకంగా సంస్థ పోరాటం సాగిస్తుంది. ఇక ఇదే కాకుండా వేల సంఖ్యలో నమోదైన సూట్లు సంస్థను ఇబ్బంది పెడుతున్నాయి. ఇక తమ ఉత్పత్తుల ద్వారా ఆరోగ్య సమస్యల ఆరోపణలు ఖండిస్తుంది జాన్సన్ అండ్ జాన్సన్ .

పౌడర్ పై వ్యాజ్యాలతోనే ఈ నిర్ణయం తీసుకున్న జాన్సన్ అండ్ జాన్సన్
ఉత్తర అమెరికాలో టాల్క్-ఆధారిత జాన్సన్ బేబీ పౌడర్ డిమాండ్ చాలావరకు తగ్గుతోందని ఇక రాబోయే రెండు నెలలలో అమెరికా, కెనడా దేశాలలో అమ్మకాలు నిలిపివేస్తామని, ప్రస్తుతం స్టాక్ ఉన్నంతవరకు అమ్మకాలు సాగిస్తామని చెప్తుంది. ఇక ఈ నిర్ణయం తీసుకోవటం వెనుక బలమైన కారణాలే ఉన్నట్టు తెలుస్తుంది. వినియోగదారుల అలవాట్లలో మార్పులు, తప్పుడు సమాచారం, పౌడర్ పై వ్యాజ్యాలు దీనికి ఆజ్యం పోయటం తోనే జాన్సన్ అండ్ జాన్సన్ ఈ నిర్ణయం తీసుకుంది. సరఫరా ముగిసే వరకు ఉన్న ఇతర రీటైల్ మార్కెట్లటలో అమ్మకాలు కొనసాగుతాయని పేర్కొంటున్నారు .

విచారణ నుంచి తప్పించుకునేందుకే పౌడర్ అమ్మకాల నిలిపివేత అని ఆరోపణలు
జాన్సన్ అండ్ జాన్సన్ ఉత్పత్తుల వల్ల తమకు క్యాన్సర్ వచ్చిందనే ఆరోపణలతో 16,000 కంటే ఎక్కువ కేసులను సంస్థ ఎదుర్కొంటున్న నేపధ్యంలో ఈ నిర్ణయంతీసుకుంది . దీంతోపాటు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నిర్వహించిన పరీక్షలో కూడా డేంజరస్ కాంపౌండ్స్ ఉన్నాయని తేలింది . మరోవైపు న్యూజెర్సీలోని ఫెడరల్ కోర్టులో 16,000కు పైగా సూట్ల విచారణ కొనసాగుతున్న సమయంలో బేబీ పౌడర్ అమ్మకాల నిలిపివేత ప్రకటన విచారణ నుంచి తప్పించుకునేందుకే అన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి .
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications