For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రపంచ తొలి బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌కు కెనడా ఆమోదం

|

క్రిప్టోకరెన్సీకి దిగ్గజ కంపెనీల నుండి దేశాల వరకు పచ్చజెండా ఊపుతున్నాయి. ఇటీవల ప్రపంచ దిగ్గజ కంపెనీ టెస్లా ఇంక్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్‌లో భారీగా పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. మాస్టర్ కార్డ్ కూడా క్రిప్టోకరెన్సీకి అనుమతి ఇచ్చింది. తాజాగా కెనడియన్ రెగ్యులేటర్ బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌కు ఓకే చెప్పింది.

బిట్ కాయిన్ పైన పలు దేశాలు, సెంట్ర‌ల్ బ్యాంకుల ఆంక్ష‌ల విధించిన‌ క‌రోనా సమయంలోను స‌రికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. బిట్ కాయిన్ 48 వేల డాలర్లకు చేరుకున్న విషయం తెలిసిందే. గత రెండు మూడు నెలల కాలంలోనే ఏకంగా 25వేల డాలర్ల నుండి 48వేల డాలర్లకు ఎగిసింది.

Canadian regulator clears launch of worlds first bitcoin ETF

ఇప్పుడు కంపెనీల నుండి దేశాల ఆమోదం దిశగా సాగుతోంది. ప్ర‌ముఖ అంత‌ర్జాతీయ ఫైనాన్సింగ్ సేవ‌ల సంస్థ‌లైన జేపీ మోర్గాన్, వీసా, పేపాల్, మాస్ట‌ర్ కార్డ్ మ‌ద్ద‌తును ఇప్పటికే పొందింది.

ఇప్పుడు బంగారం మాదిరి బిట్ కాయిన్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్‌కు(ETF) కెనడాకు చెందిన ప్రధాన సెక్యూరిటీ రెగ్యులేటర్ ఒంటారియో సెక్యూరిటీస్ క‌మిష‌న్ అనుమతిచ్చింది. అంటే ఇప్పుడు బంగారం వలె బిట్ కాయిన్‌ను కొనుగోలు చేయవచ్చు. 2020 మార్చి నుండి బిట్ కాయిన్ 1100 శాతానికి పైగా ఎగిసింది.

English summary

ప్రపంచ తొలి బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌కు కెనడా ఆమోదం | Canadian regulator clears launch of world's first bitcoin ETF

Canada's main securities regulator has cleared the launch of the world's first Bitcoin exchange-traded fund, an investment manager said on Friday, providing investors greater access to the cryptocurrency that has sparked an explosion in trading interest.
Story first published: Monday, February 15, 2021, 18:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X