కరోనా మహమ్మారి కారణంగా కెనడా ఈ సంవత్సరం తొలి త్రైమాసికంలో ఆర్థిక మాంద్యంలోకి నెట్టివేయబడిందని ఓ నివేదిక వెల్లడించింది. గణాంకాల ఆధారంగా ఈ అంచనాకు వచ్చినట్లు సీడీ హోవే ఇనిస్టిట్యూట్‌కు చెందిన బిజినెస్ సైకిల్ కౌన్సిల్ వెల్లడించింది. మార్చిలో జీడీపీ 9 శాతం మేర క్షీణించిందని, మున్ముందు మరింతగా క్షీణిస్తే తిరిగి ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం కష్టమేనని అభిప్రాయపడింది. కెనడా గతంలో ఎన్నడూ చూడని అత్యంత దారుణ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోబోతుందని బడ్జెట్ కార్యాలయం అధికారి పేర్కొన్నారు.

కెనడాపై ఆ దేశాల కొట్లాట కొట్లాట ప్రభావం
కరోనా విపత్తు వల్ల కెనడా ఆర్థిక మాంద్యంలోకి అడుగు పెట్టిందని, మే నెలలో మరింత దారుణ పరిస్థితులోకి వెళ్లే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. కరోనా కారణంగా చమురు ధరల పతనం, నెల రోజుల పాటు రష్యా - సౌదీ మధ్య చమురు ధరల యుద్ధం వంటి కారణాలు కెనడా ఆర్థిక కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపాయి. 5 శాతానికి పైగా ఆయిల్, గ్యాస్ సెక్టార్ నుండి వస్తుంది.

ఇప్పట్లో కోలుకోకపోవచ్చు
కెనడా జీడీపీలో ఆ దేశ ఆయిల్ ఇండస్ట్రీ వాటా 5.6 శాతం వరకు ఉంటుంది. గత రెండు మూడు నెలలుగా రెట్టింపు సరఫరా-భారీ డిమాండ్ తగ్గింపు కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నది. సౌదీ-రష్యా ధరల పోరు బాధితుల్లో ఎక్కువగా నష్టపోయిన దేశాల్లో కెనడా ముందుంది. చమురు ధరలు క్రమంగా పెరుగుతున్నప్పటికీ, ఇప్పటికిప్పుడు కోలుకుంటుందనే పరిస్థితులు కనిపించడం లేదు. కెనడా ఆర్థిక వ్యవస్థ తొలి క్వార్టర్‌లో 9.8 శాతం తగ్గిపోతుందని, రెండో క్వార్టర్‌లో 37.5 శాతం పడిపోనుందని ఆర్థికవేత్తల అంచనా.

అప్పటి కంటే కఠిన పరిస్థితులు
1961 తర్వాత తొలిసారి జీడీపీ దారుణంగా పడిపోయింది. మిలియన్ల కొద్ది ఉద్యోగాలు పోయాయి. ఉపాధి అవకాశాలు ఏకంగా 3.3 రేట్లు పడిపోయి 58.5 శాతానికి చేరుకుంది. 1997 ఏప్రిల్ నుండి అత్యంత కనిష్టం ఇదే. 2008 ఆర్థిక సంక్షోభం, 2014లో ధరల క్రాష్ తర్వాత కంటే అత్యంత కఠిన పరిస్థితులను కెనడా ఎదుర్కొంటోంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications