IT News: TCS బాటలోనే ఇన్ఫోసిస్.. వర్క్ ఫ్రం హోం విధానానికి స్వస్తి.. కానీ..
IT News: ఇంటి నుంచి పనిచేయడానికి ఇటీవల TCS ముగింపు పలికిన విషయం తెలిసిందే. తాజాగా ఈ లిస్టులోకి ఇన్ఫోసిస్ చేరింది. US మరియు కెనడాలోని ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఇకపై అందుబాటులో ఉండదని పేర్కొంది. ఈ విషయంలో కంపెనీ ఆదేశాలు పాటించకపోతే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
రిమోట్‌గా పని చేయాలనుకునే ఉద్యోగులు ఇకపై ప్రత్యేక అనుమతి పొందవలసి ఉంటుందని తన ఉద్యోగులకు ఇటీవల పంపిన కమ్యూనికేషన్‌లో ఇన్ఫోసిస్ పేర్కొంది. ఈ నిర్ణయం దాదాపు 30 వేల మంది సిబ్బందిపై ప్రభావం చూపనున్నట్లు ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది. భారతీయులకు ఈ నిబంధల నుంచి మినహాయింపు ఇవ్వడం గమనార్హం. ఇండియాలో ఉద్యోగులను దశల వారీగా కార్యాలయాలకు తీసుకొచ్చేందుకు గత నవంబర్ నుంచి ఓ ప్రణాళికను అమలుచేస్తోంది.

ఉద్యోగులు కార్యాలయానికి తిరిగి రావడం పట్ల ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మరియు హెచ్‌ఆర్ డెవలప్‌మెంట్ గ్రూప్ హెడ్ కృష్ణమూర్తి శంకర్ హర్షం వ్యక్తం చేశారు. "ప్రాజెక్ట్, వ్యాపార అవసరాలను పూర్తి చేయడం కోసం మా బృందాలు సమిష్టిగా, సృజనాత్మకతో ఎలా ముందడుగు వేస్తాయో చూడాలని చాలా ఉత్సాహంగా ఉంది" అని 2022-23కు సంబంధించిన కంపెనీ ఆర్థిక ఫలితాల ప్రకటన తర్వాత పేర్కొన్నారు.
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి గతంలో పంచుకున్న భావాలకు అనుగుణంగా ఈ పాలసీలో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇంటి నుంచి పని చేయాలని చూడొద్దని యువ ఉద్యోగులకు గతం ఫిబ్రవరిలోనే ఆయన సూచించారు. మూన్‌లైటింగ్‌పై జరిగిన చర్చల్లోనూ నైతికత ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.


Click it and Unblock the Notifications