Canada economy: ప్రస్తుతం అంతర్జాతీయ విపణిలో ఇండియాకున్న పలుకుబడి మరే ఇతర దేశానికీ లేదనే చెప్పాలి. పలు వర్థమాన దేశాల ఆర్థిక వ్యవస్థలకు భారత మార్కెట్లే ఆధారం. అంతటి గొప్ప స్థానంలో ఉన్న ఇండియాతో కయ్యానికి కాలు దువ్వి పాకిస్థాన్ ఎలా తయారైందో.. స్నేహం చేస్తూ పొరుగునున్న శ్రీలంక, బంగ్లాదేశ్ లు ఏవిధంగా ఎదుగుతున్నాయో అందరికీ తెలిసిదే..
ఇండియా మోస్ట్ వాంటెడ్, ఖలిస్థానీ వేర్పాటువాది నిజ్జర్ హత్యలో భారత ఏజెన్సీల హస్తం ఉందంటూ కెనడా ప్రదాని జస్టిన్ ట్రూడో నిరాధార ఆరోపణలు చేశారు. దీనికితోడు అక్కడి ఇండియన్ దౌత్యవేత్తలు, ఎంబసీలకు వస్తున్న బెదిరింపులను సీరియస్ గా తీసుకున్న మోదీ సర్కార్.. ప్రతిచర్యలకు దిగింది. దీని పర్యవసానం ఎలా ఉండబోతుంది అనే విషయంపై ఓ సంస్థ తాజాగా నివేదిక విడుదల చేసింది.

కెనడా ఆర్థిక వ్యవస్థ ముఖ్యంగా ఉన్నత విద్యకోసం వచ్చే విద్యార్థులపై ఆధారపడింది. కాగా 2024లో హయ్యర్ ఎడ్యుకేషన్ నిమిత్తం అక్కడికి వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్యలో కేవలం 5 శాతం తగ్గుదల నమోదైనా.. కెనడా ఆర్థిక వ్యవస్థ 727 మిలియన్ల డాలర్ల మేర నష్టపోవచ్చని ఇమాగిండియా ఇన్‌స్టిట్యూట్ నివేదిక నిర్ధారించింది.
ఏటా కెనడా వెళ్లే విదేశీ విద్యార్థుల్లో భారత్ వాటా ఎక్కువ. 2022లో దాదాపు 2.25 లక్షల మంది స్టూడెంట్స్ కు కెనడియన్ వీసాలు మంజూరయ్యాయి. సంవత్సరంలో మూడు దఫాలుగా విద్యార్థులు అక్కడికి వెళ్తుంటారు. వచ్చే జనవరి బ్యాచ్ లో కేవలం 5 శాతం(3 వేల 300) తగ్గితే కెనడా ఎకానమీకి కనీసం 230 మిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లనున్నట్లు అధ్యయనం చెబుతోంది.
'విద్యార్థులకు ల్యాప్ టాప్ కొనుగోలు, గృహ ఖర్చులు, బ్యాంక్ డిపాజిట్, ఫ్లైట్ టికెట్ల కోసం అయ్యే సగటు ఖర్చు 16 వేల డాలర్లు. ఇదికాక 2 ఏళ్ల ఎడ్యుకేషన్ పీరియడ్ లో బస కోసం మరో 53 వేల డాలర్లు ఖర్చవుతుంది. వెరసి ఓ విద్యార్థి ద్వారా 69 వేల డాలర్లు కెనడా ఆర్థిక వ్యవస్థలోకి వెళ్తున్నాయి' అని ఇమాంగిండియా ప్రెసిడెంట్ రాబిందర్ సచ్ దేవ్ తెలిపారు.


Click it and Unblock the Notifications