Canada News: కెనడా జీడీపీకి సిక్కు జనాభా సహకారం.. మాంద్యంలో వేడెక్కిన దౌత్యం..
Canada News: ప్రస్తుతం కెనడా-ఇండియా మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయి. దేశంలోని ఒక సీనియర్ కెనడియన్ దౌత్యవేత్తను బహిష్కరించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. 5 రోజుల్లో దేశాన్ని వీడాలని తెలిపింది.
దీనికి ముందు కెనడా ఒక సీనియర్ భారతీయ దౌత్యవేత్తను బహిష్కరించడం, ఖలిస్తానీ నాయకుడి హత్య వెనుక భారత హస్తం ఉందంటూ ఆరోపించటంతో ఇండియా కెనడియన్ దౌత్యవేత్తను వెనక్కి పంపుతోంది. సిక్కులకు ప్రత్యేక దేశాన్ని సృష్టించాలని కోరుతూ వేర్పాటు వాదాన్ని ప్రోత్సహిస్తోంది ఖలిస్తాన్ ఉద్యమం. ఇది కెనడాలో చాలా బలంగా ఉన్న సంగతి తెలిసిందే.

కెనడాలో సిక్కు జనాభా దాదాపు 8 లక్షలుగా ఉంది. 2021 లెక్కల ప్రకారం కెనడా మెుత్తం జనాభాలో వీరి సంఖ్య 2.1 శాతం. వీరు కెనడాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నాలుగో అతిపెద్ద మతంగా ఉంది. దీంతో కెనడాలో పెరుగుతున్న సిక్కుల శాతం ఆ దేశ ఆర్థికాభివృద్ధికి ఏదో ఒక రూపంలో దోహదపడుతోంది. అయితే ప్రస్తుతం కెనడా ఆర్థిక వ్యవస్థ ఊహించని విధంగా వృద్ధి ఫ్లాట్ గా కొనసాగుతోంది. దీని ఫలితంగా రానున్న కొన్ని నెలల్లో కెనడా ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
పైగా సంక్షోభం కారణంగా పెద్ద బహుళజాతి సంస్థలు లక్షలాది ఉద్యోగాలను తగ్గింస్తున్నందున ఎక్కువగా వలసదారులు, తాత్కాలిక వీసాలపై ఉన్న వ్యక్తులు ఎక్కువగా ప్రభావితం అవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై చర్చలు ఇప్పుడు స్తంభింపజేయడంతో.. భారత్-కెనడా మధ్య దౌత్యపరమైన ఒత్తిళ్లు వాణిజ్య సంబంధాలను బలహీనపరుస్తున్నాయి.


Click it and Unblock the Notifications