IPO News: ఐపీవో బంపర్ లిస్టింగ్.. తొలిరోజే అప్పర్ సర్క్యూట్ తాకి భారీ లాభాలు.. కొన్నారా..
Ramdevbaba Solvent: చాలా రోజుల తర్వాత ఐపీవోల కోలాహలం బుల్ మార్కెట్లో కొనసాగుతోంది. ఈరోజు మార్కెట్లోకి అడుగుపెట్టిన ఐపీవో ప్రీమియం ధరకు జాబితా అయ్యి ఇన్వెస్టర్లకు డబ్బుల వర్షం కురిపించింది. కంపెనీ ఐపీవోపై బెట్టింగ్ వేసిన పెట్టుబడిదారులు పండుగ చేసుకుంటున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది రామ్‌దేవ్‌బాబా సాల్వెంట్ కంపెనీ ఐపీవో గురించే. నేడు కంపెనీ షేర్లు మార్కెట్లోకి బలమైన జాబితాను నమోదు చేసింది. లిస్టింగ్ సమయంలో కంపెనీ షేర్లు ఇష్యూ ధర కంటే 31 శాతం అధిక ధర రూ.112 వద్ద మార్కెట్లోకి అడుగుపెట్టాయి. వాస్తవానికి ఇష్యూ సమయంలో కంపెనీ షేర్లను రూ.85 గరిష్ఠ ధర వద్ద ఇన్వెస్టర్లకు విక్రయించింది. రామ్‌దేవ్‌బాబా సాల్వెంట్ ఐపీవోపై బెట్టింగ్ వేసిన ఇన్వెస్టర్లు ఒక్కో షేరుపై తొలిరోజే రూ.27 లాభాన్ని ఆర్జించారు.

వాస్తవానికి ఈ ఐపీవో రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఏప్రిల్ 15న సబ్‌స్క్రిప్షన్ కోసం తెరవబడి ఏప్రిల్ 18న ముగిసింది. నేడు లిస్టింగ్ తర్వాత రామ్‌దేవ్‌బాబా సాల్వెంట్ షేర్లు 5% ఎగువ సర్క్యూట్‌తో రూ.117.60కి చేరుకున్నాయి. 2008లో స్థాపించబడిన కంపెనీ శుద్ధి చేసిన రైస్ బ్రాన్ ఆయిల్‌ను ఉత్పత్తి చేసి పంపిణీ చేస్తుంది. ప్రస్తుతం ఈ రైస్ బ్రాన్ ఆయిల్‌ను మదర్ డైరీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్, మారికో లిమిటెడ్, ఎంపైర్ స్పైసెస్ అండ్ ఫుడ్స్ లిమిటెడ్ వంటి కంపెనీలకు విక్రయిస్తోంది. ఇదే క్రమంలో కంపెనీ తన సొంత బ్రాండ్లు తులసి, సెహత్ కింద రైస్ బ్రాన్ ఆయిల్‌ను తయారు చేసి మార్కెట్ చేస్తోంది.
రామ్‌దేవ్‌బాబా సాల్వెంట్ ఐపీవో 126 సార్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ చేయబడింది. ఇదే క్రమంలో రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 79.96 రెట్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోటా 314.46 రెట్లు, క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయ్యర్స్ కోటా 65.95 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. పెట్టుబడిదారుల కోసం లాట్ పరిమాణాన్ని కంపెనీ 1600 షేర్లుగా నిర్ణయించింది. ఎవరైనా రిటైల్ పెట్టుబడిదారుడు కంపెనీ షేర్లలో లాట్ కొనుగోలు చేసేందుకు బెట్టింగ్ వేయాలంటే కనీసం రూ.1.36 లక్షలు ఇన్వెస్ట్ చేశారు. తాజా ఐపీవో ద్వారా కంపెనీ మార్కెట్ల నుంచి రూ.50.27 కోట్లను సమీకరించింది. కంపెనీ షేర్లు నేడు ఎన్ఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీలో జాబితా కాగా.. ఐపీవోకి ముందు కంపెనీలో ప్రమోటర్ల వాటా 81.01%గా ఉంది.


Click it and Unblock the Notifications