Vehicle Loan: దేశంలోని ప్రఖ్యాత నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల్లో మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ కూడా ఒకటి. తాజాగా కంపెనీ లోన్ల విషయంలో పెద్ద కుంభకోణం జరిగినట్లు కనిపెట్టింది.
వివరాల్లోకి వెళితే మహీంద్రా ఫైనాన్స్ సంస్థ జనవరి-మార్చి త్రైమాసికంలో ఒక తన వ్యాపార బ్రాంచ్ లో రూ.150 కోట్ల మోసం జరిగినట్లు గుర్తించింది. అయితే ఇది రిటైల్ వెహికల్ లోన్స్ విభాగంలో జరిగినట్లు పేర్కొంది. ఇక్కడ కేవైసీ వివరాల ఫోర్జరీ జరిగిందని కంపెనీ గుర్తించింది. దీనిపై చేపట్టిన దర్యాప్తు అధునాతన దశలో ఉన్నట్లు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమాచారం అందించింది.

కంపెనీ తాజా అంచనాల ప్రకారం రుణ మోసం ప్రభావం కంపెనీపై రూ.150 కోట్లకు మించి ఉండబోదని వెల్లడైంది. ఈ వ్యవహారంపై పరిశోధన ముమ్మరంగా జరుగుతోందన్న కంపెనీ అవసరమైన దిద్దుబాటు చర్యలను గుర్తించినట్లు పేర్కొంది. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న వ్యక్తులుతో సహా ఇతర చర్యలు కొనసాగుతున్నాయని కంపెనీ తెలిపింది. దీని కారణంగా కంపెనీ తన మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక ఫలితాల విడుదలను గతంలో ఎంపిక చేసిన తేదీ నుంచి వాయిదా వేసింది.
వాస్తవానికి కంపెనీ తన క్యూ4 ఆదాయ ఫలితాలను ఏప్రిల్ 23న ప్రకటించాల్సి ఉంది. ఏప్రిల్ 23, 2024న షెడ్యూల్ చేయబడిన ఆడిట్ కమిటీ, బోర్డు మీటింగ్ సంబంధిత సమావేశాల్లో చర్చించాల్సిన అన్ని ఇతర విషయాలను పరిశీలిస్తుందని కంపెనీ తెలిపింది. ఇది మొత్తం రుణ పరిమితులను పెంచడం, నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల జారీ ద్వారా నిధుల సమీకరణను కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. కంపెనీలో జరిగిన మోసపూరిత రుణాల గురించి వార్త వెలుగులోకి రావటంతో నేడు స్టాక్ కుప్పకూలింది. ఉదయం 10 గంటల సమయంలో ఇంట్రాడేలో షేర్లు 4.66 శాతం పతనంతో ఒక్కోటి రూ.265.85 రేటు వద్ద కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications