Canada: భారతీయులు ఉద్యోగాల వేటలో ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇప్పటికే స్థిరపడ్డారు. అయితే ఎక్కువగా వెస్ట్రన్ దేశాలకు వెళ్లే వారిలో భారతీయుల సంఖ్య ఎక్కువే. అయితే కరోనా తర్వాత చాలా దేశాలు ఉపాధి అవకాశాలను స్థానికులకే ఇస్తున్నాయి. దీంతో వెనుకబడిన మన వారికి ఇప్పుడు జాక్ పాట్ ఆఫర్ రెడీగా ఉంది.

కెనడాలో ఉద్యోగాలు..
ఆర్థిక మందగమనంతో జాబ్ మార్కెట్ నెమ్మదించింది. కానీ ఇలాంటి సమయంలో కూడా కెనడాలో ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది. కెనడాలో 10 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. దీంతో కెనడా విదేశీయులను నియమించుకునేందుకు ఆసక్తి చూపుతోంది. తాజాగ కెనడా తన ఇమ్మిగ్రేషన్ లక్ష్యాలను పెంచే ప్రణాళికలను ప్రకటించింది.

ప్రజల అవసరం..
కెనడాకు భారీ సంఖ్యలో కొత్తవారిని చేర్చుకోవాలని యోచిస్తున్నట్లు కెనడా మంత్రి సీన్ ఫ్రేజర్ అన్నారు. ఇందుకు చాలా మంది జనం అవసరమని చెప్పారు. కెనడాలో పదవీ విరమణ పొందిన వారి సంఖ్య ఎక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. రానున్న కాలంలో కూడా కెనడాలో డిమాండ్ మరింతగా పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో అక్కడ విదేశీ నివాసితుల సంఖ్య పెరగనుంది.

వృద్ధుల సంఖ్య..
ప్రస్తుతం కెనడాలో నివసిస్తున్న ప్రతి ఏడుగురిలో ఒకరు 55-64 మధ్య వయస్కులు ఉన్నారని తేలింది. దీనివల్ల అక్కడ కంపెనీల్లో ఉపాధి అవకాశాలు సైతం భారీగా ఉన్నాయి. అందుల్ల వ్యాపారులు నష్టపోకుండా.. విదేశీ ఉద్యోగులను ప్రోత్సహించే మార్గంగా కెనడా వీసా సడలింపులను ప్రకటించింది.

లక్షల్లో అవసరం..
కెనడాలో జనాన్ని పెంచేందుకు అనుమతిస్తున్నందున వలసదారుల సంఖ్య నిరంతరం పెరుగుతోందని ఫ్రేజర్ అన్నారు. 2021 నాటికి 4,05,000 మంది, 2023లో 4,65,000, 2024లో 4,85,000, 2025లో 5,00,000 మందికి కెనడాలో స్థిరపడేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. అయితే 2021 జనాభా లెక్కల ప్రకారం కెనడాలో మెుత్తం జనాభా 3.9 కోట్లుగా ఉంది. ప్రతి నలుగురిలో ఒకరు విదేశాల్లో జన్మించిన వారు ఇందులో ఉన్నారు.

భారతీయులకు అవకాశం..
కెనడా 2025 నాటికి ప్రవాస ఆర్థిక వ్యవస్థలో 60% వృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇది అర్హత కలిగిన భారతీయ ఉద్యోగులకు మంచి అవకాశంగా మారింది. నైపుణ్యాలు కలిగిన భారతీయులు దీనిని అందిపుచ్చుకునేందుకు పోటీపడుతున్నారు. రానున్న కాలంలో మనదేశం నుంచి చాలా మంది అక్కడ స్థిరపడేందుకు వీసా లక్ష్యాల పెంపు గొప్ప అవకాశంగా మారింది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications