Jobs In Canada: కెనడాలో 10 లక్షల జాబ్స్.. ప్రభుత్వం ఆహ్వానం.. ఏఏ రంగాల్లో అంటే..

Jobs In Canada: విదేశాల్లో ఉద్యోగం అనగానే భారతీయులు దానిని అందిపుచ్చుకోవటంలో ముందు వరుసలో ఉంటారు. అలాంటి ఏకంగా 10 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయనే విషయం తెలిస్తే. అవి కూడా అక్కడి ప్రభుత్వమే ఈ ఆఫర్ అందిస్తోందంటే అది వేరే లెవల్. అసలు ఈ ఆఫర్ ఎక్కడో ఏమిటో పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

గ్రాండ్ జాబ్ ఓపెనింగ్స్ ..

గ్రాండ్ జాబ్ ఓపెనింగ్స్ ..

కెనడాలో గ్రాండ్ జాబ్ ఓపెనింగ్స్ - 10 లక్షల కంటే ఎక్కువ ఖాళీలు ఉన్నాయి. ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఒక నివేదిక తెలిపింది. జాబ్స్ కోసం సర్చ్ చేస్తున్న, అందులోనూ ప్రధానంగా వలసదారులకు గ్రాండ్ ఓపెనింగ్స్ ను కెనడా ప్రభుత్వం ప్రకటించింది.

దరఖాస్తు ఎలా..

దరఖాస్తు ఎలా..

కెనడాలో పని చేయడానికి ఎదురు చూస్తున్న వారికి ఇది మంచి అవకాశం. శాశ్వత నివాసం కోసం ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ ద్వారా ఈ రిక్రూట్‌మెంట్ కోసం ఔత్సాహికులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం.. కెనడా ప్రభుత్వం 2022 సంవత్సరంలో 4,30,000 కంటే ఎక్కువ మంది శాశ్వత నివాసితులను ఆశిస్తోంది. దీని ద్వారా ప్రభుత్వ సహకారం పూర్తి స్థాయిలో ఉన్నట్లు కనిపిస్తోంది.

నిరుద్యోగులు ఇలా..

నిరుద్యోగులు ఇలా..

ఈ లక్ష్యం 2024లో 4,50,000కి చేరుతుందని CIC వార్తా సంస్థ తన నివేదికలో తెలిపింది. ప్రత్యేకించి.. అల్బెర్టా, అంటారియోలో ప్రతి ఉద్యోగ ఖాళీకి సగటున 1.1 మంది నిరుద్యోగులు ఉన్నారు. అదేవిధంగా.. న్యూఫౌండ్‌ల్యాండ్, లాబ్రడార్‌లలో ప్రతి ఖాళీ ఉద్యోగానికి నలుగురు నిరుద్యోగులు ఉన్నారు.

ఏఏ రంగాల్లో ఉగ్యోగాలంటే..

ఏఏ రంగాల్లో ఉగ్యోగాలంటే..

కెనడా నిర్మాణ రంగంలో ఏప్రిల్ నెలలో 89,900 మంది నిరుద్యోగులు ఉన్నారు. ఇదే సమయంలో.. వృత్తిపరమైన, శాస్త్రీయ, సాంకేతిక సేవలు, రవాణా అండ్ వేర్ హౌసింగ్, ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్, వినోదం రంగాల్లో ఉద్యోగ ఖాళీలు అధిక సంఖ్యలో ఉన్నాయి.

ప్రపంచ దేశాల లేబర్ కు ఆహ్వానం..

ప్రపంచ దేశాల లేబర్ కు ఆహ్వానం..

దీనిని పరిగణనలోకి తీసుకున్న కెనడా ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేయడానికి ప్రపంచ దేశాల నుంచి అర్హులైన, ఔత్సాహిక వ్యక్తులను ఆహ్వానించింది. కెనడా లేబర్ మార్కెట్ ఈ సంవత్సరం 55 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు వర్క్‌ఫోర్స్‌ను విడిచిపెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆ దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల ఉద్యోగ ఖాళీలు కూడా ఉన్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+