Gujarat Toolroom: ప్రస్తుతం మార్కెట్లో చిన్న షేర్లు చిచ్చర పిడుగుల్లా మారుతున్నాయి. ఇన్వెస్టర్ల సొమ్మును రెండింతలు మూడింతలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలో బ్రోకరేజ్ సంస్థ BUY రేటింగ్ అందించిన కంపెనీ షేర్ల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది గుజరాత్ టూల్‌రూమ్ లిమిటెడ్ కంపెనీ షేర్ల గురించే. ఈ కంపెనీ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(RIL) నుంచి వరుసగా రెండోసారి భారీ ఆర్డర్ దక్కించుకుంది. కొత్తగా ఆర్డర్ పొందినట్లు వార్త బయటకు రావటంతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా గుజరాత్ టూల్‌రూమ్ షేర్లపై కొనుగోలుకు ఎగబడ్డారు. దీంతో ఇంట్రాడేలో స్టాక్ 2.5 శాతం పెరిగి దాదాపు రూ.34.99 స్థాయి వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ గుజరాత్ టూల్‌రూమ్ కంపెనీకి తాజాగా రూ.65 కోట్ల విలువైన ఆర్డర్ ఇచ్చింది. గత నెలలోనే రిలయన్స్ నుంచి కంపెనీ రూ.29 కోట్ల విలువైన ఆర్డర్‌ను అందుకున్న తర్వాత తాజా ఆర్డర్ వచ్చింది. ఈ విధంగా రెండు కంపెనీల మధ్య ఒప్పందం మొత్తం రూ.200 కోట్లకు పైగా చేరింది. మార్చి నెలలో షేర్ ధర 52 వారాల గరిష్ఠ ధర అయిన రూ.62.97ను చేరుకుంది. అయితే తర్వాత జరిగిన కరెక్షన్ వల్ల షేర్ ధర రూ.40 స్థాయికి తగ్గింది.
ఇటీవల కంపెనీ అర్హులైన వాటాదారులకు ఒక్కో షేరుకు రూ.45 డివిడెండ్ ప్రకటించింది. దీని కోసం కంపెనీ రికార్డు తేదీని 20 ఏప్రిల్ 2024గా నిర్ణయించింది. గుజరాత్ కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీ ఎక్స్‌పోర్ట్స్-ఇంపోర్ట్స్, ఇన్‌ఫ్రాలో అగ్రగామి సంస్థగా కొనసాగుతోంది. బ్రోకరేజీలు కంపెనీ షేర్లపై ప్రస్తుతం బులిష్ వ్యూహాన్ని కలిగి ఉన్నాయి. ఇటీవల గుజరాత్ టూల్‌రూమ్‌కి భారీ సంఖ్యలో ఆర్డర్లు వస్తున్న నేపథ్యంలో ప్రాఫిట్‌మార్ట్ సెక్యూరిటీస్ షేర్లకు BUY రేటింగ్ అందిస్తూ రానున్న కాలంలో రూ.90 స్థాయికి చేరుకుంటుందని బ్రోకరేజ్ తన అంచనాలను ప్రకటించింది.


Click it and Unblock the Notifications