For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐడియా-వోడాఫోన్ విలీనంతో టెలికాం రంగంలో ఏం జ‌ర‌గ‌నుంది?

ఐడియా-వోడాఫోన్ల విలీనంతో దేశ టెలికాం రంగ ముఖ చిత్ర‌మే మారిపోనుంది. 40 కోట్ల చందాదారుల‌తో 35% మార్కెట్ వాటా క‌లిగిన కొత్త టెలికాం సంస్థ ఏర్ప‌డుతుంది. ఈ నేప‌థ్యంలో ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేష‌న్ టెలిక

|

ఐడియా-వోడాఫోన్ల విలీనంతో దేశ టెలికాం రంగ ముఖ చిత్ర‌మే మారిపోనుంది. 40 కోట్ల చందాదారుల‌తో 35% మార్కెట్ వాటా క‌లిగిన కొత్త టెలికాం సంస్థ ఏర్ప‌డుతుంది. ఈ నేప‌థ్యంలో ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేష‌న్ టెలికాం రంగం గురించి వెలువ‌రించిన 10 ఆస‌క్తిక‌ర అంశాలు మీ కోస‌మే...

1. మొబైల్ సిమ్ వాడ‌కం దార్లు 100 కోట్ల‌కు పైనే

1. మొబైల్ సిమ్ వాడ‌కం దార్లు 100 కోట్ల‌కు పైనే

ఇప్ప‌టికే దేశంలో మొబైల్ సిమ్ వినియోగ‌దారుల సంఖ్య 100 కోట్లు దాటేసింది. 2016,మార్చి నాటికి మన దేశంలో మొత్తం టెలికాం కస్టమర్ల సంఖ్య‌ 105.86 కోట్లు. 19.96 శాతం వార్షిక వృద్ధి రేటు(సీఏజీఆర్‌)తో ఈ సంఖ్య ఏటేటా పెరుగుతోంది.

2. ఇంట‌ర్నెట్ వినియోగంలో భార‌త్ స్థానం 3

2. ఇంట‌ర్నెట్ వినియోగంలో భార‌త్ స్థానం 3

గ‌తేడాది జులై నాటికి మన దేశంలో మొత్తం 46.21 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులున్నారు. దీంతో అంత‌ర్జాల వినియోగంలో ప్రపంచంలోనే మూడో అతి పెద్ద మార్కెట్‌గా భారత్ నిలిచింది.

3. స్మార్ట్‌ఫోన్ ఫోన్‌కాల్స్‌కు త‌క్కువ‌; ఇంట‌ర్నెట్‌కే ఎక్కువ‌

3. స్మార్ట్‌ఫోన్ ఫోన్‌కాల్స్‌కు త‌క్కువ‌; ఇంట‌ర్నెట్‌కే ఎక్కువ‌

మన దేశంలో మొబైల్ ఇంటర్నెట్ చాలా కీలకం. ప్రతీ 8 మంది ఇంటర్నెట్ వినియోగాదారుల్లో 7 గురు మొబైల్ ద్వారానే వినియోగిస్తున్నారు. ప్రీపెయిడ్ స్మార్ట్ ఫోన్ క‌లిగిన వారిలో ఆ ప‌రిక‌రాన్ని ఫోన్ చేసేందుకు 15% మాత్ర‌మే ఉప‌యోగిస్తుండ‌గా దాదాపు 75% ఆన్‌లైన్‌లో స‌మాచార శోధ‌న‌కే వాడుతున్నారు.

4. వీడియోలు చూసేందుకు యూట్యూబ్‌

4. వీడియోలు చూసేందుకు యూట్యూబ్‌

2012 నుంచి ఇప్పటివరకూ మన దేశంలో వీడియోలు చూసే అలవాటు సగటున ఏడాదికి 200 గంటల మేర పెరిగింది. స‌మాచార వెతుకులాట‌కు యాప్‌ల కంటే ఎక్కువ‌గా గూగుల్ క్రోమ్‌, యూసీ బ్రౌజ‌ర్ల‌పైనే ఆధార‌ప‌డుతున్నారు. వీడియోల కోసం అంద‌రి చూపు యూట్యూబ్ వైపే.

5. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ఇంట‌ర్నెట్ వాడ‌కం

5. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ఇంట‌ర్నెట్ వాడ‌కం

పట్టణ ప్రాంతాల్లో మొబైల్ వాడకం 154.01 శాతంగా ఉండగా.. గ్రామాల్లో ఇది 51.37 శాతంగా ఉంది. జూన్ 2016 నాటికి 37 కోట్ల మంది మొబైల్‌లో ఇంట‌ర్నెట్ వాడుతుండ‌గా వారిలో 71% మంది ప‌ట్ట‌ణ ప్రాంతాల‌కు చెందిన వారు.

6. ఎయిర్‌టెల్ వాటా అత్య‌ధికం

6. ఎయిర్‌టెల్ వాటా అత్య‌ధికం

మార్చి 2016 నాటికి 24.31 శాతం మార్కెట్ వాటాతో ఎయిర్‌టెల్ మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో ఉన్న వొడాఫోన్‌కు 19.15 శాతం వాటా ఉంది. స్మార్ట్‌ఫోన్ వాడ‌కం పెరిగే కొద్దీ మొబైల్లో ఇంట‌ర్నెట్ వాడే వారి సంఖ్య ప‌ల్లె, ప‌ట్ట‌ణం తేడా లేకుండా విస్త‌రిస్తోంది.

7. టాప్-5 సంస్థ‌ల వాటా 78.74%

7. టాప్-5 సంస్థ‌ల వాటా 78.74%

భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా, రిలయన్స్, బీఎస్ఎన్‌ఎల్ సంస్థలు టెలికాం టాప్-5గా ఉండగా, వీటికి మొత్తం దేశీయ టెలికాం మార్కెట్లో 78.74 శాతం వాటా ఉంది. బ్రిక్స్ దేశాల్లో మొత్తంగా చూసిన‌ప్పుడు మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ వాడ‌కంలో బ్రెజిల్ అగ్ర‌స్థానంలో ఉండ‌గా, చైనా రెండో స్థానంలో ఉంది. 2020 నాటికి భార‌త్ మూడో స్థానంలో నిల‌వ‌నుంది.

8. ఫిక్స్‌డ్ లైన్లు క‌నుమ‌రుగేనా?

8. ఫిక్స్‌డ్ లైన్లు క‌నుమ‌రుగేనా?

ఫిక్స్‌డ్ లైన్స్ సంఖ్య 2.59 కోట్లకు పరిమితం కాగా, మొబైల్ విప్లవం కారణంగా ఇది 2.06 శాతానికి పడిపోయింది. ఒక‌ప్పుడు బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ కావాలంటే రోజుల త‌ర‌బ‌డి వేచి చూసే అవ‌స‌రం ఉండేది. ప్ర‌స్తుతం ల్యాండ్‌లైన్ల‌పై ఆస‌క్తి పూర్తిగా త‌గ్గిపోయింది.

9. ల్యాండ్ లైన్ ఫోన్ల‌లో బీఎస్ఎన్ఎల్‌యే రారాజు

9. ల్యాండ్ లైన్ ఫోన్ల‌లో బీఎస్ఎన్ఎల్‌యే రారాజు

ఫిక్స్‌డ్ లైన్ నెట్వర్క్‌(ల్యాండ్ లైన్ ఫోన్ల‌)లో 60.28 శాతం వాటాతో బీఎస్ఎన్ఎల్ మార్కెట్ల్ఓ అగ్ర ప‌థాన దూసుకెళుతుండ‌గా.. ఎంటీఎన్ఎల్‌కు 13.60 శాతం వాటా ఉంది. బీఎస్ఎన్ఎల్‌, ఎంటీఎన్ఎల్‌, భార‌తీ ఎయిర్‌టెల్ మూడింటికి క‌లిపి ఫిక్స్‌డ్ లైన్ మార్కెట్లో 87.46% వాటా ఉంది.

బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్లో అగ్ర‌స్థానంలో ఎయిర్‌టెల్

బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్లో అగ్ర‌స్థానంలో ఎయిర్‌టెల్

మార్చి 2016 నాటికి మొత్తం బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్లో 25.7 శాతం వాటాతో ఎయిర్‌టెల్ అగ్ర స్థానంలో ఉండగో 18.54 శాతం వాటాతో వొడాఫోన్ రెండో ప్లేస్‌లో నిలిచింది. ట్రాయ్ న‌వంబ‌రులో వెలువ‌రించిన స‌మాచారం ఆధారంగా బీఎస్ఎన్ఎల్‌కు 9.95 మిలియ‌న్‌, ఎయిర్‌టెల్‌కు

2.03 మిలియ‌న్ వినియోగ‌దారులు ఉన్నారు.

Read more about: idea vodafone airtel telecom
English summary

ఐడియా-వోడాఫోన్ విలీనంతో టెలికాం రంగంలో ఏం జ‌ర‌గ‌నుంది? | 10 interesting facts about the Indian telecom sector in the verge of idea-vodafone merger

The merger of Idea Cellular and Vodafone announced earlier today is likely to create the biggest telecom operator in the country with a customer base of close to 400 million, or 35% market share.Here are 10 interesting facts about the Indian telecom sector, compiled from a March 2017 report on the telecom sector by India Brand Equity Foundation (IBEF) report.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X