For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వొడాఫోన్ ఐడియా మూతబడితే.. : ఎయిర్‌టెల్-జియోల పరిస్థితి ఇదీ!

|

టెలికం రంగం నుండి వొడాఫోన్ ఐడియా తప్పుకుంటే ఎయిర్‌టెల్‌తో పాటు జియోపై కూడా భారం పడుతుందని అంటున్నారు. వీటి ఆపరేషనల్ ఖర్చు (Opex), కేపిటల్ ఖర్చు(capex) భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. AGR, ఇతర బకాయిల రూపంలో వొడాఫోన్ ఐడియా భారీ మొత్తంలో చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం తమకు ఊరట ఇవ్వకంటే మూసివేసే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశాయి.

టెల్కో కష్టాలు: ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా.. మరిన్ని కథనాలు

ఖర్చులు పెరుగుతాయి

ఖర్చులు పెరుగుతాయి

దేశంలో ప్రధాన ప్రయివేటు టెల్కోలు ప్రస్తుతం భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియో ఉన్నాయి. వొడాఫోన్ ఐడియా క్లోజ్ అయితే మిగతా రెండు టెల్కోల మధ్యనే పోటీ ఉంటుంది. ఈ టెల్కోకు 300 మిలియన్ల కస్టమర్లు ఉన్నారు. ఇందులో 40 శాతం మంది ఎయిర్‌టెల్‌కు మారుతారని అంచనా. అదే సమయంలో ఎయిర్‌టెల్ ఆపరేషన్ల్ ఖర్చులు 15 శాతం నుండి 20 శాతం పెరుగుతాయని భావిస్తున్నారు. సమీప భవిష్యత్తులోను capex మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.

మార్కెట్ వాటా పెరుగుతుంది

మార్కెట్ వాటా పెరుగుతుంది

ఖర్చులు పెరిగినప్పటికీ మార్కెట్ షేర్ పెంచుకోవడంలో ఎయిర్‌టెల్, జియోకు భారీగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఎయిర్‌టెల్ కంటే జియోకు మరింత ప్రయోజనంగా భావిస్తున్నారు. ఏజీఆర్, ఇతర బకాయిల విషయంలో జియో సేఫ్ సైడ్‌లో ఉంది.

కేక్ వాక్ ఏమీ కాదు..

కేక్ వాక్ ఏమీ కాదు..

అయితే వొడాఫోన్ ఐడియా నుండి జియో, ఎయిర్‌టెల్‌లకు కస్టమర్లు మారితే.. ఆ రెండ టెల్కోలకు మాత్రం ఇది కేక్ వాక్ ఏమీ కాదని చెబుతున్నారు. వారు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాలి. అందుకు అనుగుణంగా నెట్ వర్క్ కెపాసిటీని పెంచుకోవాల్సి ఉంటుంది. అలాగే, వొడాఫోన్ ఐడియా స్పెక్ట్రం వనరులు కొనుగోలు చేసే ధరపై ఆధారపడి ఉంటుంది.

కస్టమర్లు మారితే..

కస్టమర్లు మారితే..

వొడాఫోన్ ఐడియా డిఫాల్టర్‌గా మారితే జియో, ఎయిర్‌టెల్‌కు మారే కస్టమర్ల వాటా 40:60 శాతంగా ఉంటే, ఈ రెండు కంపెనీల ఎబిట్డా 50 శాతం మార్జిన్‌చో రూ.15,000 కోట్లు, రూ.10,000 కోట్లుగా ఉండవచ్చునని చెబుతున్నారు. అప్పుడు ఆయా కంపెనీల ఎబిట్డా వరుసగా 29 శాతం, 22 శాతం పెరిగి రూ.67,100 కోట్లు, రూ.54,700 కోట్లకు చేరుకుంటుందని అంచనా.

English summary

వొడాఫోన్ ఐడియా మూతబడితే.. : ఎయిర్‌టెల్-జియోల పరిస్థితి ఇదీ! | Vodafone Idea's exit may increase Airtel, Jio opex and capex

A potential Vodafone Idea (VIL) shutdown could push opex and capex levels up in the near-term for Bharti Airtel and Reliance Jio Infocomm, but such cost upticks would be more than offset by strong customer gains for both telcos if the sector takes on a private sector duopoly structure, analysts said.
Story first published: Tuesday, February 18, 2020, 15:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X