IPO News: నేడే ప్రారంభమైన ఐపీవో.. గ్రేమార్కెట్లో దుమ్ము దులిపేస్తోంది.. బెట్ట్ వేస్తున్నారా..
Emmforce Autotech IPO: కొంత గ్యాప్ తర్వాత మళ్లీ దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐపీవోల రాక మెుదలైంది. దీంతో ఐపీవోలపై బెట్టింగ్ వేసే పెట్టుబడిదారులు తమ డబ్బును సిద్ధం చేసుకుంటున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఎమ్‌ఫోర్స్ ఆటోటెక్ లిమిటెడ్ ఐపీవో గురించే. రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడి కోసం కంపెనీ ఐపీవో ఇష్యూ నేడు ప్రారంభం అవుతోంది. పెట్టుబడిదారులు ఇందులో బెట్టింగ్ వేసేందుకు ఏప్రిల్ 25 వరకు అవకాశం ఉంది. గ్రేమార్కెట్లో ఐపీవో అద్భుతమైన పనితీరును కనబరుస్తోంది. ఈ క్రమంలో కంపెనీ తన ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను రూ.93-98గా నిర్ణయించింది.

ఎస్ఎమ్ఈ కేటగిరీలో వస్తున్న ఐపీవో పెట్టుబడిదారుల కోసం లాట్ పరిమాణాన్ని 1,200 షేర్లుగా నిర్ణయించింది. దీని కారణంగా పెట్టుబడిదారుడు ఐపీవోలో పాల్గొనాలంటే కనీసం రూ.1,17,600 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. రూ.100 కంటే తక్కువ ధరకే మార్కెట్లోకి వస్తున్న ఎమ్‌ఫోర్స్ ఆటోటెక్ లిమిటెడ్ షేర్లకు ప్రస్తుతం గ్రేమార్కెట్లో మంచి గిరాకీ ఉంది. అందువల్ల మార్కెట్లో జాబితాకి ముందే షేర్లు అద్భుతమైన పనితీరును కనబరుస్తున్నాయి. వాస్తవానికి కంపెనీ తాజా ఐపీవో నుంచి రూ.53.90 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈరోజు అంటే మంగళవారం ఉదయం ఐపీవోకి చెందిన ఒక్కో షేరు రూ.100 ప్రీమియంతో ట్రేడవుతోంది. టాప్ షేర్ బ్రోకర్ అంచనాల ప్రకారం కంపెనీ లిస్టింగ్ రోజున మార్కెట్లోకి 102 శాతం ప్రీమియంతో రూ.198 రేటు వద్ద జాబితా అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఇదే జరిగితే తొలిరోజే ఇన్వెస్టర్ల సొమ్ము రెట్టింపు అవుతుంది. కంపెనీ ఇప్పటికే ఏప్రిల్ 22న యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి ఏకంగా రూ.15.35 కోట్లను సమీకరించింది. ఇదే క్రమంలో రిటైల్ ఇన్వెస్టర్ల కోసం 35 శాతం వాటాలను ఐపీవోలో కేటాయించింది. ఏప్రిల్ 30న కంపెనీ షేర్లు బీఎస్ఈలో జాబీతా అవుతాయని అంచనా వేయబడింది.


Click it and Unblock the Notifications