ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. మధ్యాహ్నం గం.2.32 సమయానికి సెన్సెక్స్ 185.94 (0.45%) పాయింట్లు నష్టపోయి 41,071.80 వద్ద, నిఫ్టీ 68.35 (0.56%) పాయింట్లు నష్టపోయి 12,045.10 వద్ద ట్రేడ్ అయింది. మధ్యాహ్నం సమయానికి టాప్ గెయిన్ర్స్ జాబితాలో టైటాన్ కంపెనీ, నెస్ట్లే, టీసీఎస్, కొటక్ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్, టాప్ లూజర్స్ జాబితాలో యస్ బ్యాంకు, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, గెయిల్, సిప్లా ఉన్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 71.34 వద్ద ట్రేడ్ అయింది.

బకాయిల చెల్లింపుకు మొగ్గు
ఈ రోజు (ఫిబ్రవరి 17) వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ షేర్లు లాభాల్లోకి వచ్చాయి లేదా పెద్దగా నష్టపోలేదు. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఎయిర్‌టెల్ రూ.10వేల కోట్ల బకాయిలను చెల్లించింది. మిగతా మొత్తాన్ని త్వరలో చెల్లిస్తామని వెల్లడించింది. మరోవైపు, వొడాఫోన్ ఐడియా వ్యాపారాన్ని కొనసాగించడంపై ఆందోళన వ్యక్తం చేస్తూనే బకాయిలు పూర్తిగా చెల్లిస్తామని స్పష్టం చేసింది.

షేర్లపై ప్రభావం..
ఎయిర్‌టెల్, వొడాపోన్ ఐడియా బకాయిలు చెల్లిస్తామని సుప్రీం కోర్టుకు చెప్పడంతో వాటి షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. మధ్యాహ్నం గం.2.20 సమయానికి వొడాఫోన్ ఐడియా షేర్ 0.050 (1.47%) పెరిగి రూ.3.45 వద్ద, ఎయిర్‌టెల్ షేర్ షేర్ కూడా స్వల్పంగా పెరిగింది. అయితే ఆ తర్వాత మాత్రం ఎయిర్‌టెల్ షేర్ ధర 0.67 శాతం మేర తగ్గి రూ.561.20 వద్ద ట్రేడ్ అయింది. బకాయిలు చెల్లిస్తామని చెప్పడంతో షేర్లపై నష్టాల దిశగా పెద్దగా ప్రభావం పడలేదు.

మిగతా మొత్తం త్వరలో చెల్లిస్తాం
సుప్రీం కోర్టు తీర్పు, టెలికం శాఖ ఆదేశాల నేపథ్యంలో ఎయిర్ టెల్ రూ.10వేల కోట్ల బకాయిలను చెల్లించింది. మిగతా మొత్తాన్ని త్వరలో చెల్లిస్తామని తెలిపింది. ప్రస్తుతం తాము బకాయిలపై స్వీయ అంచనా ప్రక్రియను వేగంగా పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యామని, ఇది ముగిసిన తర్వాత సుప్రీం కోర్టు తదుపరి విచారణ తేదీలోగా మిగతా మొత్తాన్ని చెల్లిస్తామని తెలిపింది.

బకాయిలు చెల్లిస్తాం.. కానీ
వొడాఫోన్ ఐడియా కూడా సుప్రీం ఆదేశాల నేపథ్యంలో AGR బకాయిలు పూర్తిగా చెల్లిస్తామని తెలిపింది. అదే సమయంలో టెలికం వ్యాపారాన్ని కొనసాగించడంపై ఆందోళన వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు గత తీర్పుపై సవరణలు కోరుతూ దాఖలు చేసిన వ్యాజ్యంపై తాము ముందు ముందు వ్యాపారాన్ని కొనసాగించాలా వద్దా అనేది ఆధారపడి ఉంటుందని తెలిపింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications