న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా AGR బకాయిలు చెల్లించేందుకు ముందుకు వచ్చింది. అంతేకాదు, టెలికం వ్యాపారాన్ని కొనసాగించడంపై ఆందోళన వ్యక్తం చేసింది. సుప్రీం గత తీర్పుపై సవరణలు కోరుతూ దాఖలు చేసిన వ్యాజ్యంపై తాము ముందు ముందు వ్యాపారాన్ని కొనసాగించాలా వద్దా అనేది ఆధారపడి ఉంటుందని కూడా తెలిపింది. అయితే వొడాఫోన్ - ఐడియా మూతబడితే పరిస్థితి ఏమిటి?

ఎయిర్‌టెల్‌పై భారం మాత్రమే కాదు.. ఇంకా
వొడాఫోన్ ఐడియా మూతబడితే ఎయిర్‌టెల్‌పై భారం పడుతుందనే నిపుణులు భావించిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఈ టెల్కో కస్టమర్లు దాదాపు 40 శాతం మంది ఎయిర్‌టెల్‌కు మరలుతారని, అప్పుడు వ్యయభారం తగ్గవచ్చునని కూడా చెబుతున్నారు. వొడాఫోన్ ఐడియా మూతబడితే కేవలం పోటీ కంపెనీ ఎయిర్‌టెల్ పైనే కాదు.. ఇతర ఇబ్బందులు కూడా ఉన్నాయి.

వొడాఫోన్ ఐడియా మూతబడితే పెను ప్రమాదం!
వొడాఫోన్ ఐడియా డిఫాల్టర్‌గా మారితే బ్యాంకింగ్ రంగంపై, ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని భావిస్తున్నారు. ఈ టెల్కో హఠాత్తుగా కంపెనీని మూసివేస్తే వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతారు.

దుకాణాలు మూత.. ఉద్యోగాలు కోత
వొడాఫోన్ ఐడియా డిఫాల్టర్‌గా మారి కంపెనీ క్లోజ్ అయితే ఈ టెల్కోకి దేశంలో ఉన్న దుకాణాలు మూతబడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు వేలాది ఉద్యోగాలు పోతాయని, దాదాపు 14,000 ఉద్యోగాలు పోతాయని అంటున్నారు.

భారత ఆర్థిక లోటు 40 బేసిస్ పాయింట్లు పెరుగుతుంది
ఈ టెల్కో డిఫాల్టర్‌గా మారితే భారత ఆర్థిక లోటు 40 బేసిస్ పాయింట్లు (bps) పెరుగుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక లోటు జీడీపీలో 3.8 శాతం, 2019-20లో 3.5 శాతంగా ప్రభుత్వం లెక్కించింది.

రుణాలు ఇలా.. ఆర్థికవ్యవస్థపై దెబ్బ ఇలా..
వొడాఫోన్ ఐడియా గ్రాస్ డెబిట్స్ రూ.1.2 ట్రిలియన్లుగా ఉంది. ఇందులో రూ.900 బిలియన్లు ప్రభుత్వానికి చెల్లించాల్సిన స్పెక్ట్రం డెబిట్స్, రూ.250 బిలియన్లు బ్యాంకు రుణాలు ఉన్నాయి. ఇంత పెద్ద మొత్తంలో ఓ కంపెనీ డిఫాల్టర్ అయితే భారత ద్రవ్యలోటు దాదాపు 40 బేసిస్ పాయింట్లు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఏదేమైనా వొడాఫోన్ ఐడియా రుణాలు తీవ్ర ప్రభావం చూపుతాయని అంటున్నారు.

వీరందరిపై ప్రభావం
వొడాఫోన్ ఐడియా ప్రభావం ఆ టెల్కోకు ఉన్న 300 మిలియన్ల సబ్‌స్క్రైబర్లకు నెట్ వర్క్ క్లోజ్ అయితే, ఆ ప్రభావం సామాన్యులపై కూడా ఉంటుంది. వొడాఫోన్ - ఐడియాలో దాదాపు 13,500 మంది ఉద్యోగులు ఉన్నారు. అంటే నేరుగా వీరందరిపై ప్రభావం పడుతుంది. పరోక్ష ప్రభావం అయితే లక్షలాది మంది విక్రేతలు, ఇతర స్టేక్ హోల్డర్స్ పైన పడనుంది.


Click it and Unblock the Notifications