ICICI Bank: దేశంలోని ప్రైవేటు బ్యాంకింగ్ రంగంలో దిగ్గజ సంస్థ ఐసీఐసీఐ. నిన్న కోటక్ మహీంద్రా బ్యాంక్ పై రిజర్వు బ్యాంక్ ఆంక్షలు విధించిన తర్వాత నేడు అనూహ్యంగా ఐసీఐసీఐ బ్యాంక్‌కి సంబంధించిన సంచలన వార్త వెలుగులోకి వచ్చింది.
ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐకి చెందిన మెుబైల్ బ్యాంకింగ్ యాప్ iMobileలో పెద్ద లోపం సంభవించింది. దీంతో చాలా మంది వినియోగదారులు సేవలు పొందటంలో సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్నారు. ఇటీవలి కాలంలో బ్యాంక్ కస్టమర్లు తాము ఎదుర్కొన్న అవాంతరాల గురించి సోషల్ మీడియా దిగ్గజం ఎక్స్ లో ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో కొందరు వినియోగదారులు తమ క్రెడిట్ కార్డ్ వివరాలను యాప్‌లో చూడలేకపోతున్నారని పేర్కొన్నారు. కొంతమంది వినియోగదారుల ప్రకారం వారు ఇతరుల క్రెడిట్ కార్డ్‌తో పాటు మొదలైన సున్నితమైన బ్యాంకి వివరాలను చూడగలిగినట్లు వెల్లడించారు.

ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఐసీఐసీఐ బ్యాంక్, భారతీయ రిజర్వు బ్యాంక్‌ను టెక్నోఫినో వ్యవస్థాపకుడు సుమంత్ మోండల్ ట్యాగ్ చేశారు. చాలా మంది వినియోగదారులు తమ iMobile-Pay యాప్‌లో ఇతర కస్టమర్ల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్‌ల వివరాలను చూడగలుగుతున్నట్లు పేర్కొన్నారు. వారు ఇతర కార్డ్ హోల్డర్ల క్రెడిట్ కార్డ్ నంబర్, గడువు తేదీ, CVV వివరాలను యాప్‌లో చూస్తున్నట్లు చెప్పారు. దీనివల్ల కార్డుల దుర్వినియోగం, మోసపూరిత ట్రాన్సాక్షన్లు జరిగే ప్రమాదం ఉందని అన్నారు. కార్డు హోల్డర్లు తమ క్రెడిట్ కార్డులను బ్లాక్ చేసి సురక్షితంగా ఉండాలని సూచించారు. లేని పక్షంలో ప్రస్తుతం ఉన్న కార్డులను రీప్లేస్ చేయడం ఉత్తమ మార్గం అని కూడా సుమంత్ మండల్ చెప్పారు.
ఈ వ్యవహారంపై బ్యాంకింగ్ దిగ్గజం స్పందిస్తూ.. గత కొన్ని రోజులుగా జారీ చేయబడిన సుమారు 17,000 కొత్త క్రెడిట్ కార్డ్‌లు బ్యాంక్ డిజిటల్ ఛానెల్‌లలో తప్పు వినియోగదారులకు పొరపాటుగా మ్యాప్ చేయబడ్డాయని స్పష్టం చేసింది. ఈ విషయం తమ దృష్టికి వచ్చినట్లు బ్యాంక్ వెల్లడించింది. తాము ఈ కార్డులను బ్లాక్ చేసామని వీటి స్థానంలో కస్టమర్లకు కొత్త కార్డులను జారీచేస్తున్నట్లు ఐసీఐసీఐ వెల్లడించింది. టెక్నికల్ గ్లిచ్ వల్ల కలిగిన అసౌకర్యాలని కస్టమర్లు మన్నించాలని కోరింది. అయితే ఇప్పటివరకు 17,000 కార్డుల సెట్ నుంచి ఏ కార్డును దుర్వినియోగం చేసిన కేసు తమ దృష్టికి రాలేదని పేర్కొంది. ఒకవేళ ఏదైనా ఆర్థిక నష్టం జరిగితే బ్యాంక్ సదరు కస్టమర్‌కు తగిన పరిహారం ఇస్తుందని హామీ ఇచ్చింది.
ఒకవేళ కస్టమర్లు తమ ప్రమేయం లేకుండా కార్డు దుర్వినియోగానికి గురై.. ఏదైనా ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్-డెబిట్ లావాదేవీలను నివేదించడానికి కస్టమర్ కేర్ నంబర్ 18002662కు కాల్ చేయాలని ఐసీఐసీఐ కస్టమర్లకు సూచించింది. ఇటువంటి మోసాల గురించి cybercrime.gov.inలో కూడా ఫిర్యాదు చేయవచ్చు. బాధిత కస్టమరలు ICICI బ్యాంక్ 18002662 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి కూడా సహాయాన్ని పొందవచ్చని బ్యాంక్ పేర్కొంది. అయితే ప్రస్తుతానికి బ్యాంక్ లో తలెత్తిన టెక్నికల్ లోపాల వల్ల ఎలాంటి ఆర్థిక నష్టం నమోదు కాలేదు. ఇటీవలి కాలంలో దిగ్గజ బ్యాంకుల్లో ఇలాంటివి చోటుచేసుకోవటం కస్టమర్ల నమ్మకాలను సన్నగిల్లేలా చేస్తోంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications