For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

5G ట్రయల్స్‌కు అంతా సిద్ధం, హైదరాబాద్ సహా పలుచోట్ల ట్రయల్స్

|

భారత్‌లో 5G సేవల ట్రయల్స్ చేపట్టడం కోసం టెలికాం శాఖ కంపెనీలకు 5G స్పెక్ట్రం కేటాయించింది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, గుజరాత్, హైదరాబాద్ నగరాల్లో ఈ ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు వెల్లడించారు. ఇందుకు వివిధ ప్రాంతాల్లో 700 మెగా హెడ్జ్ బ్యాండ్, 3.3-3.6 గిగాహెడ్జ్ బ్యాండ్, 24.25-28.5 గిగాహెడ్జ్ బ్యాండ్ స్పెక్ట్రం కేటాయించినట్లు తెలిపారు.

చైనా కంపెనీల టెక్నాలజీ ఉపయోగించకుండా ఎరిక్సన్, నోకియా, శాంసంగ్, సీ-డాట్ టెక్నాలజీలతో 5 జీ ట్రయల్స్‌ నిర్వహణకు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, MTNLలకు మే 4న డాట్ అనుమతి ఇచ్చింది. రిలయన్స్ జియో తమ ప్రత్యేక టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ప్రాథమికంగా ఆరు నెలల పాటు ఈ ట్రయల్స్ నిర్వహిస్తారు. ఆపరేటర్లు ట్రయల్స్‌ను గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో కూడా నిర్వహించాలి. ఏ ఒక్క టెలికాం ఆపరేటర్‌కు పంజాబ్, హర్యానా, చండీగఢ్‌లలో ట్రయల్స్‌కు స్పెక్ట్రం కేటాయించలేదు.

 5G trial: Telecom department allocates spectrum to Jio, Airtel, other telcos

ఇక, హైదరాబాద్‌లో ఎయిర్‌టెల్ ట్రయల్స్ ఇప్పటికే పూర్తి చేసింది. అందుబాటులోని 1800మెగాహెడ్జ్ బ్యాండ్ స్పెక్ట్రం ద్వారా నిర్వహించారు. ప్రభుత్వం నుండి అనుమతులు, స్పెక్ట్రం లభిస్తే వెంటనే దేశవ్యాప్తంగా 5G టెలికాం సేవలు ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. హైదరాబాద్ నుండి ప్రయోగాత్మక 5G ట్రయల్స్ నిర్వహించిన తొలి కంపెనీగా ఎయిర్‌టెల్ నిలిచింది. జియో కూడా సిద్ధమవుతోంది.

English summary

5G ట్రయల్స్‌కు అంతా సిద్ధం, హైదరాబాద్ సహా పలుచోట్ల ట్రయల్స్ | 5G trial: Telecom department allocates spectrum to Jio, Airtel, other telcos

The Department of Telecom (DoT) on Friday allocated spectrum to telecom operators to start 5G trials in the country. "Telecom operators have been allocated spectrum in 700 Mhz band, 3.3-3.6 gigahertz (Ghz) band and 24.25-28.5 Ghz band across various locations," a telecom company official.
Story first published: Sunday, May 30, 2021, 20:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X