For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐడియా కీలక ప్రకటన, ఇక పోస్ట్‌పెయిడ్ ఉండదు: అందరూ రెడ్‌ప్లాన్‌లోకి..

|

వొడాఫోన్ ఐడియా సంచలన నిర్ణయం తీసుకుంది. తమ పోస్ట్‌పెయిడ్ సేవల నుంచి ఐడియా బ్రాండును ఉపసంహరించనున్నట్లు వొడాఫోన్ ఐడియా వెల్లడించింది. వొడాఫోన్, ఐడియా బ్రాండ్స్ సేల్స్ పాయింట్స్, డిజిటల్ ఛానల్స్‌లలో వొడాఫోన్ రెడ్‌పోస్ట్ పెయిడ్ పథకాలు మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపింది.

కొత్త ఆదాయపు పన్ను స్లాబ్ ఎంచుకుంటే మీరు ఏం కోల్పోతారంటే?కొత్త ఆదాయపు పన్ను స్లాబ్ ఎంచుకుంటే మీరు ఏం కోల్పోతారంటే?

పోస్ట్‌పెయిడ్‌కు ఐడియా చెల్లుచీటి

పోస్ట్‌పెయిడ్‌కు ఐడియా చెల్లుచీటి

ప్రస్తుతం ఐడియా బ్రాండుపై పోస్ట్‌పెయిట్ సేవలను ఐడియా కింద పొందుతున్న వారు ఇక వొడాఫోన్ రెడ్ స్కీమ్‌లకు మారవలసి ఉంటుంది. ఈ మేరకు కంపెనీ ప్రకటనలో తెలిపింది. ప్రీపెయిడ్ కస్టమర్లకు మాత్రం వొడాఫోన్ లేదా ఐడియా బ్రాండ్లపై సేవలు ఉంటాయని స్పష్టం చేసింది. ఐడియా పోస్ట్‌పేయిడ్ సేవల నుండి తప్పుకుంటే ఇక వొడాఫోన్ బ్రాండ్ కిందనే ఉండనున్నాయి.

ప్రస్తుతం ముంబైలో..

ప్రస్తుతం ముంబైలో..

అన్ని పోస్ట్‌పెయిడ్ ఉత్పత్తులు, సేవలు కూడా వొడాఫోన్ రెడ్ కిందకు వస్తాయని, ప్రస్తుతం ముంబైలో ఈ సేవలు ప్రారంభించామని, రాబోవు కొద్ది నెలల్లో అన్ని సర్కిళ్లలో దీనిని అందుబాటులోకి తీసుకు వస్తామని కంపెనీ గురువారం నాడు తెలిపింది.

రుణభారం తగ్గేందుకు..

రుణభారం తగ్గేందుకు..

AGR రుణాలు, పోటీ కారణంగా సెప్టెంబర్ క్వార్టర్‌లో రూ.50,922 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. ప్రస్తుత ఈ స్ట్రాటజీ మార్కెటింగ్, ఇతర ఖర్చులు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుందని, తద్వారా టెలికం కంపెనీపై రుణభారం తగ్గడానికి దోహదపడుతుందని అంటున్నారు. వొడాఫోన్ ఐడియా వచ్చే వారంలో తన డిసెంబర్ క్వార్టర్ ఫలితాలను వెల్లడించనుంది.

టారిఫ్ భారం ఉండదు..

టారిఫ్ భారం ఉండదు..

తాజా నిర్ణయంతో ఐడియా బ్రాండ్ కింద నిర్వాణ పోస్ట్‌పెయిడ్ కస్టమర్లు అందరు కూడా వొడాఫోన్ రెడ్ ప్లాన్‌లోకి వెళ్తారు. అయితే టారిఫ్‌లో ఎలాంటి మార్పులు ఉండవు. భారత్‌లో పోస్ట్ పెయిడ్ కస్టమర్లు కేవలం 5 శాతం మంది మాత్రమే ఉన్నారు.

English summary

ఐడియా కీలక ప్రకటన, ఇక పోస్ట్‌పెయిడ్ ఉండదు: అందరూ రెడ్‌ప్లాన్‌లోకి.. | Vodafone Idea closes down Idea postpaid

Vodafone Idea Ltd, which operates two mobile service brands Vodafone and Idea in the country, will now offer postpaid services only under the Vodafone brand, with the aim of streamlining this segment to one platform.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X