వొడాఫోన్ ఐడియా కస్టమరా?: మీకో గుడ్‌న్యూస్, ఇక డబుల్ డేటా ఆఫర్!
వోడాఫోన్ ఐడియా తన కస్టమర్లకు బంపరాఫర్ ప్రకటించింది. సరికొత్త డబుల్ డేటా ప్లాన్‌తో ప్రీపెయిడ్ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ప్రీపెయిడ్ ప్లాన్స్ పైన ఇప్పటికే ఇస్తున్న డాటాకు అదనంగా మరింత డేటాను ఇస్తామని ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వివరాలు...

వొడాఫోన్ ఐడియా డబుల్ బొనాంజా
ప్రీపెయిడ్ ప్లాన్స్ రూ.249, రూ.399, రూ.599 రీఛార్జ్‌లకు ఇప్పటికే 1.5GB డేటాను అందిస్తోంది వొడాఫోన్ ఐడియా. ఇప్పుడు ఈ 1.5GBకి తోడు అదనంగా మరో 1.5GB అందించనున్నట్లు తెలిపింది. వొడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ సబ్‌స్క్రైబర్లకు డబుల్ డేటా ప్యాక్ అందనుంది.

23 సర్కిళ్లలోనూ అందుబాటులో
పై ప్రీపెయిడ్ ప్లాన్స్ ద్వారా రోజుకు 4G స్పీడ్‌తో 3GB డేటా (1.5GB ప్యాక్+1.5GB అదనం)ను కస్టమర్లు వినియోగించుకోవచ్చు. ఈ డబుల్ డేటా ఆఫర్ దేశవ్యాప్తంగా ఉన్న 23 టెలికం సర్కిల్స్‌లోనూ అందుబాటులో ఉంటుంది. AGR డ్యూస్ ఆర్థిక కష్టాలు, రిలయన్స్ జియోతో గట్టి పోటీ సమయంలో వొడాఫోన్ ఐడియా ఈ డబుల్ ఆఫర్ డేటాను ప్రకటించింది.

వొడాఫోన్ ఐడియా ప్లాన్స్ గడువు
డబుల్ డేటా ఆఫర్ ప్రకారం రూ.249 రీఛార్జ్ వ్యాలిడిటీ 28 రోజులు, రూ.399 రీచార్జ్ వ్యాలిడిటీ 56 రోజులు, రూ.599 ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు ఉంది. ఈ మూడు ప్లాన్స్ పైన అన్‌లిమిటెడ్ లోకల్, నేషనల్ వాయిస్ కాల్స్‌తో పాటు 100 ఎస్సెమ్మెస్‌లు ఉచితం.

అదనపు ప్రయోజనాలు..
వొడాఫోన్ కస్టమర్లు కాంప్లిమెంటరీ కింద వొడాఫోన్ ప్లే, Zee5 సబ్‌స్క్రిప్షన్ అందిస్తోంది. ఐడియా కస్టమర్ ఐడియా మూవీస్, టీవీ యాప్ కూడా పొందవచ్చు. కాగా, ఈ డబుల్ డేటా ఆఫర్ పరిమిత కాలానికి అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నాయి. వొడాఫోన్ ఐడియా అందించే డబుల్ డేటా ఆఫర్ పూర్తి కాలమా లేక పరిమిత కాలమా తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications