AGR బకాయిలు చెల్లించాలని సుప్రీం కోర్టు టెల్కోలను హెచ్చరించింది. ఈ మేరకు గడువు విధించింది. ఇప్పటికే భారీ నష్టాల్లో ఉన్న వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ వంటి టెలికం సంస్థలకు ఇది పెద్ద ఎదురుదెబ్బ. లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రం వినియోగ ఛార్జీలు, వడ్డీలు, పెనాల్టీలు కలిపి వొడాఫోన్ ఐడియా రూ.53 వేల కోట్లకు పైగా చెల్లించాలి. ఎయిర్‌టెల్ రూ.35,586 కోట్లు, టాటా టెలీ సర్వీసెస్ రూ.13,823 కోట్లు, రిలయన్స్ కమ్యూనికేషన్స్ రూ.20,434 కోట్లు చెల్లించాలి. జియో (రూ.195 కోట్లు) తన బకాయిలు చెల్లించింది.

బకాయిలపై వొడాఫోన్ ఐడియా తీవ్ర నిర్ణయం
గత ఏడాది రైట్స్ ఇష్యూ ద్వారా ప్రమోటర్లు వొడాఫోన్ ఐడియాలో మరిన్ని నిధులు పెట్టారు. కానీ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో క్వార్టర్లోను నష్టాలు చవిచూసింది. వరుసగా ఆరో క్వార్టర్లో నిరుత్సాహకర ప్రదర్శన కనబరిచింది. దీంతో మరోసారి ఈక్విటీ పెట్టుబడులను సమకూర్చేది లేదని, అవసరమైతే తప్పుకుంటామని వొడాపోన్, ఐడియాలు ప్రకటించాయి. AGR బకాయిల విషయంలో ప్రభుత్వం కలుగజేసుకోవాలని కూడా వొడాఫోన్ ఐడియా కోరింది. వడ్డీలు, పెనాల్టీలు రద్దు చేయాలని, ఏజీఆర్ అసలు బకాయిలను చెల్లించేందుకు పదేళ్ల గడువు కావాలని కోరింది. కానీ సుప్రీం కోర్టు మాత్రం బకాయిలు అన్నీ చెల్లించాలని ఆదేశించడంతో ఇరకాటంలో పడింది. ఇప్పుడు వొడాఫోన్ ఐడియా ఏం చేస్తుందనేది ప్రశ్నగా మారింది.

వొడాఫోన్ ఐడియా కొనసాగాలని ఎయిర్‌టెల్
వొడాఫోన్ ఐడియా కార్యకలాపాలు కొనసాగాలని, అదే మంచిదని గత నెలలో ఎయిర్‌టెల్ ప్రమోటర్లు అభిప్రాయపడ్డారు. దేశీ మొబైల్ టెలికం రంగంలో మూడు కంపెనీలకు చోటు ఉన్నదన్నారు. ఇది పరిశ్రమకు మేలు చేస్తుందని చెప్పారు. ప్రభుత్వం స్పందించకుంటే కార్యకలాపాల మూసివేత లేదా దివాళా చేపట్టవలసి ఉంటుందని వొడాఫోన్ ఐడియా గతంలో తెలిపింది. దీంతో ఒకవేళ వొడాఫోన్ ఐడియా దివాళా ప్రక్రియ కోసం NCLTని ఆశ్రయిస్తే నెలకొనే పరిస్థితులపై విశ్లేషకులు వివిధరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఎయిర్‌టెల్‌కు పెరగనున్న ఖర్చు
వొడాఫోన్ ఐడియా (VIL) దివాళా ప్రక్రియ కోసం వెళ్తే అఫ్పుడు ఎయిర్‌టెల్‌పై మరింత భారం పడనుందని అంచనా వేస్తున్నారు. VIL లేకుంటే ఎయిర్‌టెల్ తక్కువ ఖర్చు మోడల్‌కు ఇబ్బందులు ఎదురవుతాయని ఎస్బీఐ క్యాప్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ రాజీవ్ అన్నారు.

ఇలా ఖర్చులు పెరగవచ్చు
ఇండస్ టవర్ తదితరాల ద్వారా మొబైల్ టెలికం మౌలికసదుపాయాల్ని ఎయిర్‌టెల్ పంచుకుంటున్నాయని చెబుతున్నాయి. వొడాఫోన్ ఐడియా కార్యకలాపాలు నిలిచిపోతే ఇందుకు విఘాతం ఏర్పడి, ఖర్చులు పెరగవచ్చునని అంటున్నారు. టవర్ల షేరింగ్ తదితరాలకు అడ్డంకులు ఎదురయితే ఎయిర్‌టెల్‌కు నెట్ వర్క్, కస్టమర్ సర్వీసింగ్ వ్యయాలు 15% వరకు పెరిగే అవకాశముందని ఎస్బీఐ క్యాప్స్ పేర్కొంది.

వ్యయం పెరిగి... కస్టమర్లకు చౌక సర్వీసులకు చెక్ పడొచ్చు
అప్పుడు ఖర్చులు పెరిగి, ఏళ్లుగా కస్టమర్లకు అందిస్తోన్న చౌక వ్యయాల సర్వీసులకు చెక్ పడవచ్చునని అభిప్రాయపడింది. ఇండస్ టవర్స్, భారతీ ఇన్ఫ్రాటెల్ మధ్య విలీనం పెండింగులో ఉన్న సమయంలో వొడాఫోన్ ఐడియా కార్యకలాపాలు నిలిపివేస్తే ఎయిర్‌టెల్‌కు భవిష్యత్తులో టవర్ కాంట్రాక్ట్ వ్యయాలు పెరిగే అవకాశముందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ అభిప్రాయపడింది.

నమ్మకమైన సంస్థను కోల్పోయినట్లే..
అంతేకాదు, వివిధ సవాళ్లను నియంత్రణ సంస్థల దృష్టికి తీసుకు వెళ్లే అంశంలో నమ్మకమైన భాగస్వామిని ఎయిర్‌టెల్ కోల్పోతుందని నిపుణులు అంటున్నారు. రిలయన్స్ జియో... ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలకు భిన్నమైన వ్యూహాలతో ముందుకు వెళ్తోంది.

అదే సమయంలో
వొడాఫోన్ ఐడియా కార్యకలాపాలు నిలిచిపోతే 40 శాతం వరకు సబ్‌స్రైబర్లు ఎయిర్‌టెల్ వైపు వెళ్తారని, అప్పుడు పెరగనున్న వ్యయాల ద్వారా భారతీ ఎయిర్‌టెల్‌కు లబ్ధి చేకూరవచ్చునని కూడా ఎస్బీఐ క్యాప్స్ అభిప్రాయపడింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications