For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నేడు మార్కెట్‌కు సెలవు: డెల్టా వేరియెంట్ ఎఫెక్ట్.. ఆర్థిక రికవరీపై ప్రభావం

|

బక్రీద్ సందర్భంగా నేడు(జూలై 21, బుధవారం) ఈక్విటీ, కరెన్సీ, డెరివేటివ్స్ మార్కెట్లు నేడు క్లోజ్‌గా ఉన్నాయి. కమోడిటీ మార్కెట్ నేడు మార్నింగ్ క్లోజ్‍‌గా ఉంటుంది. అయితే సాయంత్రం కమోడిటీ కార్యకలాపాలు కొనసాగుతాయి. జూలై 22 గురువారం ట్రేడింగ్ తిరిగి తెరుచుకోనుంది.

మంగళవారం నాడు స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అంతకుముందు రోజు (సోమవారం) కూడా సూచీలు నష్టపోయాయి. ఈ వారం మొదటి రెండు రోజుల్లో సెన్సెక్స్ దాదాపు 1000 పాయింట్లు, నిఫ్టీ దాదాపు 300 పాయింట్లు పతనమైంది. 30 షేర్ సెన్సెక్స్ నిన్న 355 పాయింట్లు లేదా 0.68 శాతం పతనమై 52,198.51 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 120.30 పాయింట్లు లేదా 0.76 శాతం క్షీణించి 15,632.10 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.

Stock market holidays: BSE, NSE to remain closed today

మార్కెట్లు సోమవారం పతనాన్ని మంగళవారం కూడా కొనసాగించాయని, దాదాపు ఒక శాతం మేర నష్టపోయాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దేశీయంగా, అంతర్జాతీయంగా అమ్మకాల ఒత్తిడి పెరిగిందని చెబుతున్నారు. డెల్టా వేరియంట్ వైరస్ నేపథ్యంలో కోవిడ్ 19 కేసులు పెరగడం ఆర్థిక రికవరీపై ప్రభావం చూపుతుందనే ఆందోళనలతో మార్కెట్లు కుప్పకూలుతున్నాయని చెబుతున్నారు.

English summary

నేడు మార్కెట్‌కు సెలవు: డెల్టా వేరియెంట్ ఎఫెక్ట్.. ఆర్థిక రికవరీపై ప్రభావం | Stock market holidays: BSE, NSE to remain closed today

On account of Bakri-Id across nation, trading at BSE and NSE will remain suspended today. As per the list of stock market holidays 2021 available at the official BSE website there will be no action in Equity, Derivative and SLB Segments today.
Story first published: Wednesday, July 21, 2021, 12:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X