Multi Bagger stock:అయోధ్యతో ముడిపడి ఉన్న ఈ మల్టీబ్యాగర్ కంపెనీ 200శాతం రాబడి ఇచ్చిందా..?
Multi Bagger stock:స్టాక్ మార్కెట్లు నిన్న పేలవమైన ప్రదర్శన కనబర్చాయి. దీంతో చాలామంది ఇన్వెస్టర్లు ఒక్కింత నిరాశకు గురయ్యారు. ఇక ఈరోజు మార్కెట్లు కాస్త పాజిటివ్‌గానే కనిపించాయి. ప్రస్తుతం ఒక చిన్న కంపెనీకి సంబంధించిన స్టాక్ అధిక లాభాలను తీసుకొస్తోంది. అదే రెస్పాన్సివ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. (Responsive Industries limited).
ఈ కంపెనీకి సంబంధించి కిందటి రోజు ముగింపు రూ.302.55 ఉండగా ఈరోజు అనగా జనవరి 24వ తేదీన ఇంట్రాడే ట్రేడింగ్‌లో రూ.324.30ని టచ్ చేసింది. ఇదిలా ఉంటే ఈ స్టాక్ 52 వారాల గరిష్టం రూ.364.80గా ఉండగా అదే 52 వారాల కనిష్టం రూ.104.95గా ఉన్నింది.

ఒక్కసారిగా పెరిగిన స్టాక్ ధర: రెస్పాన్సివ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ రంగంలో పేరుగాంచిన సంస్థగా గుర్తింపుంది. ప్రవిత్రమైన అయోధ్య నగరంలో ఈ కంపెనీ హాస్పిటాలిటీ ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టులపై కూడా ఫోకస్ చేసింది.ఈ ప్రాజెక్టులను దక్కించుకున్న సంస్థ కంపెనీ రెవిన్యూ గణనీయంగా పెరుగుతుందనే అంచనాతో ఉంది.
అయోధ్య యొక్క చారిత్రాత్మక మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో రెస్పాన్సివ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కీలక పాత్ర పోషిస్తోంది.ఫ్లోరింగ్, వాల్ కవరింగ్‌లలో ఇన్నోవేటివ్ సొల్యూషన్స్‌తో ముందకు వచ్చి ఆకట్టుకుంటోంది. ఇక అయోధ్య అభివృద్ధిలో భాగస్వాములైన వారితో ఈ సంస్థ జతకట్టడం,వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవడం, నాణ్యతతో కూడిన నిర్మాణాలు చేపట్టడం రెస్పాన్సివ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా అయోధ్యను తీర్చి దిద్దే క్రమంలో తాము భాగస్వాములవడం పట్ల ఆనందం వ్యక్తం చేసింది కంపెనీ యాజమాన్యం.

వినూత్న ఫ్లోరింగ్, వాల్ కవరింగ్‌లో అగ్రగామి సంస్థగా కొనసాగుతోన్న రెస్పాన్సివ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విభిన్నమైన పరిశ్రమల కోసం అత్యాధునిక, స్థిరమైన అధిక నాణ్యత ఉత్పత్తులను అందించడంలో కంపెనీకి మంచి గుర్తింపు ఉంది. నూతన ఆవిష్కరణలకు అనుగుణంగా ప్రమాణాలను నెలకొల్పాయి. భారతీయ రైల్వేస్‌తో కూడా రెస్పాన్సివ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ జతకట్టింది. గరీబ్‌రథ్, వందేభారత్ రైళ్లలో ఈ కంపెనీ పాత్ర ఉంది. 1982లో స్థాపించబడ్డ ఈ సంస్థ పీవీసీ ఉత్పత్తుల తయారీలో కూడా పేరుగడించింది.
ఇక ఈ సంస్థ రూ.8500 కోట్లకు పైగా మార్కెట్ క్యాప్‌ను కలిగి ఉంది.ఈ కంపెనీ స్టాక్ ధర 52 వారాల కనిష్ట స్థాయి రూ.104.95 నుంచి 200 శాతానికి పైగా మల్టీబ్యాగర్ రాబడిని ఇచ్చింది.అందుకే ఇన్వెస్టర్లు ఈ స్మాల్-క్యాప్ స్టాక్ పై నిఘా ఉంచాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
Disclaimer: ఇది కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే..పెట్టుబడి సలహా కోసం కాదు. గుడ్ రిటర్న్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు.


Click it and Unblock the Notifications