దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాల్లో ప్రారంభం అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో సానుకూల సంకేతాలు మార్కెట్లకు అండగా నిలిచాయి. అమెరికా మార్కెట్లు నిన్న లాభాల్లో ముగియడం, ఆసియా సూచీలు నేడు సానుకూలంగా ట్రేడ్ కావడం కలిసి వచ్చింది. అంతర్జాతీయంగా ఇటీవల 100 డాలర్ల దిగువకు పడిపోయిన చమురు ధరలు నేడు ఆ మార్కును దాటాయి. మాంద్యం భయాలతో ఫెడ్ నిర్ణయంపై ఊహాగానాలు ఉన్నాయి. మన దేశంలో జూన్ మాసంలో బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి 27 శాతం పెరిగింది. 2021-22లో దేశీయంగా మొబైల్ తయారీ పెరిగి దిగుమతులు భారీగా తగ్గాయి. చాలా అంశాలు మార్కెట్‌కు సానుకూలంగా మారాయి.
దీంతో నేడు మార్కెట్లు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ ఉదయం 54,574 పాయింట్ల వద్ద ప్రారంభమై, 54,627 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 54,350 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.11.35 సమయానికి సెన్సెక్స్ 212.44 పాయింట్లు ఎగిసి 54,385 పాయింట్ల వద్ద కదలాడింది. నిఫ్టీ 57 పాయింట్లు లాభపడి 16,189 పాయింట్ల వద్ద కదలాడింది. మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ఉన్నాయి.

మెటల్, రియాల్టీ రంగం మినహా అన్ని కూడా లాభాల్లో ఉన్నాయి. క్యాపిటల్ గూడ్స్ అయితే ఏకంగా 2 శాతం లాభపడింది. నేటి టాప్ గెయినర్స్ జాబితాలో లార్సన్, ఎన్టీపీసీ, కోల్ ఇండియా, యాక్సిస్ బ్యాంకు, అదానీ పోర్ట్స్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో మారుతీ సుజుకీ, HDFC లైఫ్, ఓఎన్జీసీ, టాటా స్టీల్, ఏషియన్ పేయింట్స్ ఉన్నాయి.
More From GoodReturns

ఇరాన్ యుద్దం భారత్‌కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

స్టాక్ మార్కెట్‌లో బ్లాక్ మండే.. భారీ నష్టాల్లో ట్రేడవుతున్న అన్ని రంగాలు.. ఇన్వెస్టర్లు విలవిల..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications