గతవారం టాప్ టెన్‌లోని 3 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.73,630.56 కోట్లు తగ్గింది. దేశీయ అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీగా క్షీణించింది. ఆ తర్వాత హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్, ఐసీఐసీఐ బ్యాంకు స్టాక్స్ నష్టపోయిన వాటిలో ఉన్నాయి. టాప్ టెన్‌లోని టీసీఎస్, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, ఎల్ఐసీ, ఎస్బీఐ, HDFC, భారతీ ఎయిర్ టెల్ లాభపడిన వాటిలో ఉన్నాయి. కానీ ఇవి స్వల్పంగా లాభపడటంతో నష్టపోయిన వాటి వ్యాల్యూ ఎక్కువగా ఉంది.
ఈ ఏడు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ కేవలం రూ.49,441 కోట్లు మాత్రమే పెరిగింది. కానీ రిలయన్స్, ఐసీఐసీఐ, హిందూస్తాన్ యూనీ లీవర్ మార్కెట్ క్యాప్ మాత్రం 73,630 కోట్లు క్షీణించింది. సెన్సెక్స్ గతవారం 179 పాయింట్లు లేదా 0.34 శాతం, నిఫ్టీ 52 పాయింట్లు లేదా 0.33 శాతం ఎగిసిపడింది.

రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ.62,100 కోట్లు తగ్గి రూ.16,29,685 కోట్లకు, ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.6,654 కోట్లు క్షీణించి 4,89,700 కోట్లకు, హిందూస్తాన్ యూనీలీవర్ మార్కెట్ క్యాప్ రూ.4,875 కోట్లు క్షీణించి రూ.5,36,364 కోట్లకు తగ్గింది. ఇతర కంపెనీల మార్కెట్ వ్యాల్యూ పెరిగింది.
ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ రూ.15,172 కోట్లు పెరిగి రూ.6,21,907 కోట్లకు, ఎస్బీఐ మార్కెట్ క్యాప్ రూ.11,200 కోట్లు ఎగిసి 4,16,690 కోట్లకు, ఎల్ఐసీ మార్కెట్ క్యాప్ రూ.9519 కోట్లు పెరిగి రూ.4,28,044 కోట్లకు, టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ.8,489 కోట్లు ఎగిసి రూ.12,13,396 కోట్లకు, భారతీ ఎయిర్ టెల్ మార్కెట్ క్యాప్ రూ.1,043 కోట్లు పెరిగి రూ.3,59,833 కోట్లకు, HDFC బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.91 కోట్లు పెరిగి రూ.7,51,892 కోట్లకు పెరిగింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications