600 పాయింట్లు ఎగిసిపడిన సెన్సెక్స్, 16000ను తాకిన నిఫ్టీ
స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. క్రితం సెషన్‌లో సెన్సెక్స్ 53,000ను క్రాస్ చేసి, 53,235 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు కూడా అదే దూకుడును కొనసాగిస్తోంది. దాదాపు 54,000 పాయింట్ల సమీపానికి చేరుకుంది. అమెరికా మార్కెట్లు నిన్న వర్క్ చేయలేదు. యూఎస్ ఫ్యూచర్స్ సానుకూలంగా ఉన్నాయి. క్రూడ్ ధరలు 113 డాలర్ల వద్ద ఉన్నాయి. చైనా పైన ట్రంప్ ప్రభుత్వం విధించిన ఆంక్షలను జోబిడెన్ సరళతరం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ పరిణామాలు సానుకూలంగా ఉన్నాయి. అలాగే, దేశీయంగా జూన్ నెలలో వాణిజ్య లోటు 25.6 బిలియన్ డాలర్ల గరిష్టానికి చేరుకుంది. ఇది రూపాయిపై ఒత్తిడి పెంచవచ్చు. అయితే ద్రవ్యలోటును జీడీపీలో 6.4 శాతానికి పరిమితం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఇది మార్కెట్ సెంటిమెంటుకు సానుకూలం.

సెన్సెక్స్ ఉదయం 53,501 పాయింట్ల వద్ద ప్రారంభమై, 53,790 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 53,437 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,909 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,999 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,891 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ మధ్యాహ్నం గం.11.40 సమయానికి 594 పాయింట్లు ఎగిసి 53,830 పాయింట్ల వద్ద, నిఫ్టీ 173 పాయింట్లు ఎగిసి 16,009 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ దాదాపు నెలలో మొదటిసారి 16,000 పాయింట్లను తాకింది.
అన్ని రంగాలు కూడా లాభాల్లోనే ఉన్నాయి. ఫార్మా, పవర్, మెటల్ సూచీలు 1 శాతం చొప్పున ఎగిశాయి. సెన్సెక్స్ 30 షేర్ ఇండెక్స్‌లో బజాజ్ ఫిన్ సర్వ్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్బీఐ, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, మహీంద్రా అండ్ మహీంద్రా, HDFC లాభాల్లో ఉన్నాయి.


Click it and Unblock the Notifications