స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 111 పాయింట్లు క్షీణించి 52,907 పాయింట్ల వద్ద, నిఫ్టీ 28 పాయింట్లు తగ్గి 15,752 పాయింట్ల వద్ద ముగిశాయి. దేశీయ అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ ఏకంగా ఏడు శాతానికి పైగా నష్టపోయింది. ఈ స్టాక్ రూ.190 క్షీణించి రూ.2406 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు సూచీలపై ప్రభావం చూపాయి. అమెరికా మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. ఈ ప్రభావం కూడా సూచీలపై పడింది.
మార్కెట్లు నేడు నష్టాల్లో ముగిసినప్పటికీ, పలు స్టాక్స్ మాత్రం లాభాల్లో ముగిశాయి. ఇందులో పలు స్టాక్స్ పది శాతానికి పైగా ఎగిసిపడ్డాయి. ఓమ్నిపొటెంట్ ఇండస్ట్రీస్ Ltd.(13.89%), కమర్షియల్ సిన్ బ్యాగ్స్ (12.79%), వాల్ ఫోర్ట్ ఫిన్ (12.7%), FGP Ltd(11.01%), పటేల్ ఇంటిగ్రెంట్(10.93%), సహారా హౌసింగ్ (10.74%), రుద్ర గ్లోబల్ ఇన్ఫ్రా(10.71%), SBL ఇన్ఫ్రా టెక్ Ltd.(10.53%), స్వస్తి వినాయక (10.14%), సూపర్ టెక్స్ అండ్ ఇండ్ (10.0%) భారీగా లాభపడ్డాయి.

ఆక్షర్ స్పింటెక్స్, గాలాక్టికో కార్పోరేట్, వీఎంవీ హాలీడేస్ లిమిటెడ్, ఎస్టీ కార్పోరేషన్, రోజ్ మెర్క్ లిమిటెడ్ షేర్లు 52 వారాల గరిష్టాన్ని తాకాయి. అదే సమయంలో నవరాత్రి వెంచర్స్ లిమిటెడ్, వివో బయోటెక్, మాస్ట్రోస్ ఎలక్ట్రికల్స్, అశికా క్రెడిట్, పరాగ్ మిల్క్ ఫుడ్స్ 52 వారాల కనిష్టాన్ని తాకాయి. 30 షేర్ సెన్సెక్స్ నేడు 111 పాయింట్లు నష్టపోగా, 50 షేర్ నిఫ్టీ ఇండెక్స్ 28 పాయింట్లు క్షీణించింది. నిఫ్టీ 50 ఇండెక్స్‌లో 38 స్టాక్స్ లాభాల్లో, 12 స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి.
More From GoodReturns

స్టాక్ మార్కెట్లో బ్లాక్ మండే.. భారీ నష్టాల్లో ట్రేడవుతున్న అన్ని రంగాలు.. ఇన్వెస్టర్లు విలవిల..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications