దేశీయ స్టాక్ మార్కెట్ బుధవారం(06 జూలై 2022) భారీ లాభాల్లో ఉంది. క్రితం సెషన్లో 53,135 పాయింట్ల వద్ద ముగిసిన సెన్సెక్స్, ఈ రోజు స్వల్ప లాభాల్లో ప్రారంభమైనప్పటికీ, ఆ తర్వాత అంతకు అంతకూ ఎగిసిపడింది. అమెరికా మార్కెట్లు మంగళవారం మిశ్రమంగా ముగిశాయి. ఆశియా సూచీలు మాత్రం నష్టాల్లో ఉన్నాయి. ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో బ్రెంట్, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ క్రూడ్ బ్యారెల్ ధర తగ్గింది. యూరో వ్యాల్యూ రెండు దశాబ్దాల కనిష్టానికి పడిపోయింది. పీఎల్ఐ స్కీమ్స్ జీడీపీలో 4 శాతం వాటా కలిగి ఉండే అవకాశముందని ఓ నివేదిక అంచనా వేసింది. సర్వీస్ రంగ కార్యకలాపాలు 11 ఏళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. ఇవన్నీ ఇన్వెస్టర్ల సెంటిమెంటును పెంచాయి.
సెన్సెక్స్ ఉదయం 53,170 పాయింట్ల వద్ద ప్రారంభమై, 53,584 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 53,143 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,818 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,927 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 18,800 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.11.30 సమయానికి సెన్సెక్స్ 260 పాయింట్లు లాభపడి 53,394 పాయింట్ల వద్ద, నిఫ్టీ 68 పాయింట్లు ఎగిసి 15,878 పాయింట్ల వద్ద కదలాడింది. సెన్సెక్స్ ఓ సమయంలో 550 పాయింట్లు ఎగిసింది.

పదిహేను రంగాల్లో పన్నెండు రంగాలు లాభాల్లో ఉన్నాయి. బ్యాంకు, నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఐటీ మంచి ప్రదర్శన కనబరుస్తున్నాయి. మెటల్ ఇండెక్స్ మాత్రం 2 శాతం క్షీణించింది. టాప్ గెయినర్స్ జాబితాలో హీరో మోటో కార్ప్, బ్రిటానియా, బజాజ్ ఫైనాన్స్, HUL, ఐచర్ మోటార్స్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications