For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Mukesh Ambani: RIL పగ్గాల పంపిణీ చేసిన అంబానీ.. అనంత్ చేతికి కీలక బాధ్యతలు

|

Mukesh Ambani: రిలయన్స్ ఇండస్ట్రీస్ కోసం ముఖేష్ అంబానీ వారసత్వ ప్రణాళిక రూపుదిద్దుకుంది. ఇందులో అంబానీ కుమారుడు అనంత్ అంబానీ కీలక పాత్ర పోషించనున్నారు.

అనంత్ అంబానీ..

అనంత్ అంబానీ..

ఇప్పటి వరకు రిలయన్స్ వ్యాపారాల విషయంలో అనంత్ అంబానీ పాత్ర ఎక్కడా పెద్దగా కనిపించలేదు. అయితే ఇకపై ఆయన ప్రభుత్వం, రాజకీయాలు, చట్టపరమైన వ్యవహారాలకు సంబంధించిన విషయాలపై బాధ్యతలను తండ్రి ముఖేష్ అప్పగించారు.

సన్నిహిత సంబంధాలు..

సన్నిహిత సంబంధాలు..

27 ఏళ్ల అనంత్ అంబానీ బీజేపీ నియంత్రణలో ఉన్న రాష్ట్రాల ప్రముఖ నాయకులతో సహా పలువురు ముఖ్యమంత్రులతో సన్నిహిత సంబంధాలను పెంచుకున్నారు. ఈ క్రమంలో అనంత్ ఇటీవల మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేను కూడా కలిశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న క్లీన్ ఎనర్జీ అండ్ ఆయిల్ వ్యాపారాలను నిర్వహించడానికి అనంత్ గతంలో కంపెనీ వార్షిక సాధారణ సమావేశంలో అనుబంధించబడ్డాడు.

 ఇతర వారసులు..

ఇతర వారసులు..

చిన్నవాడైన అనంత్ ఇప్పుడిప్పడే వ్యాపారాల్లోకి అడుగు పెడుతుండగా.. ఆకాష్ రిలయన్స్ జియో, డిజిటల్ వ్యాపారాల బాధ్యతలు స్వీకరించాడు. సోదరి ఇషా అంబానీ రిలయన్స్ రిటైల్ యూనిట్, మార్కెటింగ్ లను స్వాధీనం చేసుకుంది. దీనికి తోడు తాజాగా రిలయన్స్ గ్రూప్ అనుబంధ రాజ్యసభ ఎంపీ పరిమళ్ నత్వానీ కుమారుడు ధన్‌రాజ్ నత్వానీ రిలయన్స్ కార్పొరేట్ వ్యవహారాలను చేపట్టనున్నారు.

ధనరాజ్‌ పరిచయాలు..

ధనరాజ్‌ పరిచయాలు..

ధనరాజ్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహచరులతో సంబంధాలు కలిగి ఉన్నారు. ప్రస్తుతం గుజరాత్ క్రికెట్ అసోసియేషన్‌కు అధిపతిగా ఉన్నారు. ఈ పదవిని గతంలో షా, మోదీ నిర్వహించారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ధనరాజ్ ఇప్పుడు గుజరాత్‌లోని రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవహారాలను నిర్వహించడం నుంచి దిల్లీ స్థాయి సంబంధాలను కలిగి ఉన్నారు.

Read more about: mukesh ambani pm modi anant dhanraj
English summary

Mukesh Ambani: RIL పగ్గాల పంపిణీ చేసిన అంబానీ.. అనంత్ చేతికి కీలక బాధ్యతలు | mukesh ambani to pass on reliance industries succession to anant ambani

mukesh ambani to pass on reliance industries succession to anant ambani
Story first published: Thursday, November 24, 2022, 16:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X