Sterling & Wilson Renewables: అంబానీ రెన్యూవబుల్ ఎనర్జీ రంగంపై భారీ బెట్టింగ్ వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన పెట్టుబడులు కలిగి ఉన్న స్టెర్లింగ్ & విల్సన్ రెన్యూవబుల్స్ లిమిటెడ్ షేర్లు తుపాను వేగంతో దూసుకుపోతున్నాయి.
నేడు ఇంట్రాడేలో స్టెర్లింగ్ & విల్సన్ రెన్యూవబుల్స్ లిమిటెడ్ షేర్లు దాదాపు 10% లాభపడ్డాయి. ఇంట్రాడేలో కంపెనీ షేర్లు రూ.617.65 గరిష్ఠ స్థాయిని తాకటం వెనకు పెద్ద కారణం ఒకటి ఉంది. వాస్తవానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ నైజీరియా నుంచి త్వరలో ఆర్డర్లు పొందే అవకాశం ఉందని రెన్యూవబుల్ ఎనర్జీ సంస్థ తన త్రైమాసిక ఫలితాలతో పాటు పేర్కొంది. దీంతో పెట్టుబడిదారులు ఒక్కసారిగా కంపెనీ షేర్లను కొనుగోలు చేసేందుకు ఎగబడ్డారు.

మార్చి త్రైమాసిక ఫలితాల ప్రకటన సమయంలో తనకు రూ.8,000 కోట్లు విలువైన ఆర్డర్ బుక్ ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ నైజీరియా కలపలేదని పేర్కొంది. జనవరి-మార్చి మూడు నెలల కాలంలో స్టెర్లింగ్ & విల్సన్ రూ.488 కోట్ల విలువైన ఆర్డర్లను పొందింది.
స్టెర్లింగ్ & విల్సన్ మార్చి త్రైమాసిక ఆదాయం రూ.1,178 కోట్లకు పెరిగినట్లు వెల్లడించింది. అయితే కంపెనీ సానుకూల EBITDA రూ.29.4 కోట్లుగా నివేదించింది. రిలయన్స్ న్యూ ఎనర్జీ లిమిటెడ్ మార్చి 31, 2024 నాటికి స్టెర్లింగ్ & విల్సన్‌లో 32.54% వాటాను హోల్డ్ చేస్తోంది.
స్టెర్లింగ్ & విల్సన్ షేర్లు నేడు 10% లాభంతో రూ.617.15 వద్ద ట్రేడవుతున్నాయి. ఇది వరుసగా నాలుగో రోజు పెరుగుదల. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.647గా ఉంది. అదే సమయంలో 52 వారాల కనిష్ఠ ధర రూ.253.45గా ఉంది. గడచిన 12 నెలల్లో కాలంలో కంపెనీ షేర్ ధర ఏకంగా 92% పెరిగింది. ప్రస్తుతం నాలుగు ట్రేడింగ్ సెషన్లలో షేర్ ధర 23 శాతం మేర వృద్ధి చెందింది.


Click it and Unblock the Notifications