అనంత్ అంబానీ - రాధికా మర్చంట్‌ల వివాహానికి ముందు ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు ప్రపంచ నలుమూలల నుంచి బిగ్ సెలబ్రిటీస్ హాజరవుతున్నారు. గుజరాత్‌లోని జామ్ నగర్ ఈ వేడుకలకు వేదికగా నిలిచింది. మార్చి 1వ తేదీ నుంచి మార్చి 3వ తేదీ వరకు అనంత్ - రాధికాల ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఈ ఈవెంట్‌లో పలు కార్యక్రమాలను ఆహుతులను ఆకట్టుకుంటున్నాయి.
తొలిరోజు ఈవెంట్‌లో కాబోయే వధువు రాధికా మర్చంట్ ధరించిన డ్రెస్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆమె ధరించిన డ్రెస్ లగ్జరీ లేబుల్ యొక్క హాట్ కోచర్ ఆర్మ్ అయిన అటెలియర్ వెర్సాస్‌కు చెందినది. 2022 మెట్‌గాలాలో హాలీవుడ్ నటి బ్లేక్ లైవ్లీ ఇదే రకమైన దుస్తులు ధరించి వావ్ అనిపించింది. ఈ గౌన్ పై భారీ ఎంబ్రాయిడరీ వర్క్, మెటాలిక్ వర్క్‌తో అలంకరించబడి పింక్ స్ట్రాప్‌లెస్‌తో వచ్చింది. ఇక అంబానీకి కాబోయే కోడలు రాధిక వైట్ అండ్ ఎల్లో డైమండ్ నెక్‌పీస్ ధరించగా.. అందుకు మ్యాచ్ అయ్యే చెవిపోగులను ఎంచుకుంది. రోజ్ గోల్డ్ కలర్ మేకప్‌తో ఆకట్టుకుంది.

ఇక నలుపు రంగు సూట్ ధరించిన కాబోయే వరుడు అనంత్ అంబానీ రాధికా పక్కన పెర్ఫెక్ట్‌గా సూట్ అయ్యాడు.ఇదిలా ఉంటే కేవలం అంబానీల కోసం ప్రపంచ ప్రఖ్యాత పాప్ సింగర్ రాబి రిహన్నా తొలిసారిగా ఈ ఈవెంట్‌లో తన మ్యూజిక్ కాన్సర్ట్ ప్రదర్శన ఇచ్చింది.షారుఖ్ ఖాన్ నుండి మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ వరకు, డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ నుండి మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వరకు ఇలా చాలామంది సెలబ్రిటీలు ఈ గ్రాండ్ ఈవెంట్‌కు అటెండ్ అయ్యారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీ కూడా హాజరయ్యారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలబార్ తన కమేజ్ అలబార్‌తో హాజరయ్యారు.దీనితో పాటు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక తన కుమార్తె అరబెల్లా రోజ్‌తో పాటు తన భర్త జారెడ్ కుష్నర్‌తో కలిసి వచ్చారు. సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో ఆధార్ పూనావాలా తన భార్య నటాషా పూనావాలాతో కలిసి హాజరయ్యారు. వారు ధరించిన అటెలియర్ డిజైనర్ డ్రెస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
దీనితో పాటు, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరియు అతని భార్య సాక్షి ధోనీ అద్భుతమైన బ్లాక్ డ్రెస్‌లో కనిపించారు.ఈ ఏడాది జూలై 12న అనంత్ - రాధికల జంట పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications