Ambani News: అంబానీ చేతికి ఆ మీడియా సంస్థ వాటాలు.. అప్పర్ సర్క్యూట్లో స్టాక్ లాక్..
Mukesh Ambani: ఇటీవలి కాలంలో దేశంలోని మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చాలా చురుకుగా కొనుగోళ్లు చేపడుతోంది. దీంతో ప్రత్యర్థి కంపెనీలకు చెందిన వాటాలను విక్రయించటానికి అంబానీని కొందరు ఎంచుకోవటం గమనార్హం. దీంతో ఒక కంపెనీ స్టాక్ విపరీతంగా పెరుగుతోంది.
తాజాగా ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో అమెరికన్ మీడియా గ్రూప్ భారతీయ వ్యాపారాన్ని కొనుగోలు చేయవచ్చని తెలుస్తోంది. యూఎస్ మీడియా గ్రూప్ పారామౌంట్ గ్లోబల్ భారతదేశంలో తన మీడియా జాయింట్ వెంచర్ వాటాను విక్రయించడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో చర్చలు జరుపుతోందని సమాచారం. ఈ వాటా విక్రయం ద్వారా పారామౌంట్ గ్లోబల్‌కు 550 మిలియన్ డాలర్లు రానున్నాయి. ఈ మెుత్తాన్ని రుణాల చెల్లింపులకు వినియోగించనున్నట్లు తెలుస్తోంది.

పారామౌంట్ గ్లోబల్ రిలయన్స్ ఇండస్ట్రీస్'వయాకామ్18' జాయింట్ వెంచర్‌తో కలిసి భారతీయ మీడియా పరిశ్రమలో పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ జాయింట్ వెంచర్ NETWORK18 మీడియా అండ్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్ పేరుతో స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయ్యింది. వాటాల విక్రయ చర్చల వార్తలతో పారామౌంట్ స్టాక్ నేడు 5 శాతం అప్పర్ సర్క్యూట్ తాకింది. దీంతో కంపెనీ ఒక్కో షేరు ధర రూ.90.40ను తాకింది. దీనికి ముందు జనవరి 19న కంపెనీ షేర్లు 52 వారాల గరిష్ఠమైన రూ.136.20 స్థాయిని అందుకుంది.
దీనికి ముందు అమెరికాకు చెందిన వాల్ట్ డిస్నీ భారతీయ వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్‌లో ప్రధాన వాటారిలయన్స్ ఇండస్ట్రీకి చెందుతుంది. ఈ కొత్త సంస్థలో రిలయన్స్ ఇండస్ట్రీస్ 16.34%, వయాకామ్ 18 46.82%, డిస్నీ 36.84% వాటాలను హోల్డ్ చేయనున్నట్లు సమాచారం.
వయాకామ్ 18 అనేది రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ. అంటే కొత్తగా ఏర్పడనున్న కంపెనీలో రిలయన్స్ గ్రూప్ ప్రత్యక్షంగా, పరోక్షంగా మెుత్తంగా 63.16 శాతం వాటాను కలిగి ఉంటుంది. విలీనం తర్వాత ఏర్పడిన సంస్థకు ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారని తెలుస్తోంది. ఈ డీల్ మెుత్తం విలువ రూ.70 వేల కోట్లుగా ఉంది.


Click it and Unblock the Notifications