Elon Musk: ఎలాన్ మస్క్‌కి మోదీ సర్కార్ అండ.. అంబానీకి పెద్ద దెబ్బే..!!
Starlink News: చాలా కాలంగా ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్ భారత మార్కెట్లను టార్గెట్ చేశారు. తన వ్యాపారాలను ఇండియాలో విస్తరింపచేయాలని నిర్ణయించారు. అయితే ఇక్కడి ప్రభుత్వం నుంచి అనుమతుల కోసం ఇన్నాళ్లుగా వేచి చూసిన సంగతి తెలిసిందే.
త్వరలోనే ప్రధాని మోదీని ఎలాన్ మస్క్ కలవనున్నట్లు ప్రకటించిన కొన్ని రోజులకే.. మస్క్ శాటిలైట్ ఆథారిత కమ్యూనికేషన్ వెంచర్ స్టార్‌లింక్ భారత ప్రభుత్వం నుంచి వ్యాపారానికి అవసరమైన అనుమతిని పొందటం గమనార్హం. టెలికాం మంత్రిత్వ శాఖ నుంచి కీలకమైన వ్యాపార అనుమతిని స్టార్‌లింక్ పొందేందుకు మూడున్నరేళ్లుగా వేచి చూసి తాజాగా విజయం పొందింది. దీంతో క్లిష్టమైన అడ్డంకిని మస్క్ కంపెనీ అధిగమించింది.

అయితే మస్క్ కొన్ని భద్రతా విషయాలపై హోం మంత్రిత్వ శాఖ తుది పరిశీలన కోసం వేచి ఉన్నాట్లు తెలుస్తోంది. లైసెన్స్ షరతుల ప్రకారం సాంకేతిక అవసరాలు పరిశీలించబడ్డాయి. వాణిజ్య భాగం విదేశీ పెట్టుబడులు, నికర విలువ వంటి అంశాలపై పరిశీలించబడింది. కంపెనీ యాజమాన్యానికి సంబంధించి "డిక్లరేషన్" కూడా సమర్పించింది. ఇక స్టార్‌లింక్ కంపెనీ యాజమాన్యం విషయంలో భారతదేశంతో భూ సరిహద్దును పంచుకునే దేశం నుంచి కంపెనీకి వాటాదారులు లేరని ప్రభుత్వం నిర్ధారించాలనుకుంది.
స్టార్‌లింక్ భారతీయ వినియోగదారుల KYC వివరాలు, కస్టమర్ సమాచారం దేశం బయటి సర్వర్లకు తరలించకూడదని టెలికాం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. భద్రతాపరమైన అంశాలకు సంబంధించి ఉపగ్రహాల నుండి వచ్చే డేటా బీమ్‌లు భారతదేశంలో మాత్రమే ల్యాండ్ కావాలి. ఉపగ్రహాల కదలిక కారణంగా విదేశీ తీరాలకు చేరుకోకూడదు. ఫైల్‌ను వైష్ణవ్ ఆమోదించిన తర్వాత కంపెనీ శాటిలైట్ (GMPCS) సేవల లైసెన్స్ ద్వారా గ్లోబల్ మొబైల్ వ్యక్తిగత కమ్యూనికేషన్‌ను పొందుతుంది. ఇది భారతదేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలను అందించాలనుకునే ఎవరికైనా తప్పనిసరి. ఇప్పటికే ఇదే తరహా వ్యాపారంలోకి ఎయిర్‌టెల్ ఒక వెబ్, అంబానికి చెదిన జియో లైసెన్సులను పొందిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications